శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (18:59 IST)

నారా రోహిత్, నందిత 'సావిత్రి' సంగతేమిటి...? రివ్యూ రిపోర్ట్

సావిత్రి నటీనటులు : నారా రోహిత్‌, నందిత, మురళీశర్మ, అజయ్‌, మధు రమాప్రభ తదితరులు; సంగీతం : శ్రవణ్‌, నిర్మాత : వి.బి. రాజేంద్ర ప్రసాద్‌, దర్శకత్వం : పవన్‌ సాదినేని
 
హీరోగా నారారోహిత్‌ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తూనే వున్నారు. అయితే తొలి సినిమా 'బాణం' తర్వాత  మరలా అంతటి పేరు రాలేదు. తర్వాత వచ్చిన చిత్రాలన్నీ.. ఓ మోస్తరు సినిమాలు కావడమే కారణం. తాజాగా 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌'తో పరిచయమై మెప్పించిన దర్శకుడు పవన్‌ సాదినేనిల కాంబినేషన్‌లో ఆయన చేయడంతో ఏదో వుందని అనిపించింది. మరి అదెలా వుందో చూద్దాం.
 
కథ
మురళీ శర్మకు ఇద్దరు కుమార్తెలు. తన మేనకోడలు పెండ్లి జరుగుతుండగా నందిత పుడుతుంది. తన అమ్మ పేరుతో సావిత్రిగా పేరు పెట్టేస్తాడు ఆమె తండ్రి. ఇక  చిన్నప్పట్నుంచే పెళ్ళి అంటే విపరీతమైన ఇష్టం. పెళ్ళి చేసుకోవాలన్నది ఆమె జీవితాశయం. తన అక్క గాయత్రి (ధన్యా బాలకృష్ణన్‌) పెళ్ళి అయిపోతే ఇక చేసుకోవాలని కలలుగంటుంది. తన అక్క పెండ్లి ఇష్టం లేక పారిపోతుంటే సావిత్రి పట్టి ఇస్తుంది. నువ్వు పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవాలని శపిస్తుంది. కొన్నాళ్ళకు  ఓ మొక్కుపై షిర్డీకి వెళ్ళే క్రమంలో సావిత్రికి రైలులో రిషి(నారా రోహిత్‌) అనే ఓ డాక్టర్‌ పరిచయమవుతాడు. వీరిద్దరూ షిర్డీకి వెళ్ళే ఈ ప్రయాణంలోనే కొన్ని అనుకోని పరిస్థితుల్లో దగ్గరవుతారు. అయితే అది ప్రేమో, ఆకర్షణలో తెలియని తింగరి సావిత్రిది. ఆ తర్వాత ఆ ఊరిలోనే వుండే అల్లరి రవి సావిత్రి కోసం వెంటాడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథ.

 
పెర్‌ఫార్మెన్స్‌
ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది.. నందిత పాత్రే. సావిత్రి పాత్రలో చలాకిగా.. తుంటరి పిల్లగా, అమాయకత్వంతో కూడిన పాత్రను బాగా పండించింది. నారా రోహిత్‌.. బాగా బొద్దుగా వుండటంతో పాత్రకు సరైన న్యాయం చేయలేకపోయాడనే అనిపిస్తుంది. మొదటి సినిమా నుంచి కొన్ని ఫీలింగ్స్‌ను పండించినా.. చాలా సందర్భాల్లో బ్లాంక్‌ ఫేస్‌ కన్పిస్తుంది. ఇంకా నటన మెరుగుపర్చుకోవాల్సి వుంది. జబర్‌దస్త్‌ గ్యాంగ్‌లో ముగ్గురు ఇందులో నటించారు. వారితోపాటు సాగే ప్రయాణంలో పోసాని పాత్ర కాస్త ఎంటర్‌టైన్‌ చేస్తుంది. మురళీ శర్మ తండ్రి పాత్రలో.. ఆయన సోదరుడుగా అజయ్‌ నటించారు. 
 
సాంకేతిక విభాగం
దర్శకుడు పవన్‌ మొదటి నుంచి చెబుతున్నట్లుగానే ఒక కొత్త ఆలోచనతో, ఓ కమర్షియల్‌ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. కథాగమనంలో ఎంటర్‌టైన్‌ చేశాడు. ముఖ్యంగా కమర్షియల్‌ అంశాలకు జోడించడంలో అక్కడక్కడా తేలిపోయాడు. మాటల పరంగా కృష్ణచైతన్య పలుకులు వినడానికి బాగున్నాయి. ఎక్కడా ద్వందార్థాలు లేవు. వసంత్‌ అందించిన సినిమాటోగ్రఫీ కథ మూడ్‌కి తగ్గట్టుగా చాలా బాగుంది. ముఖ్యంగా మొదటి ఇరవై నిమిషాలు, చివరి ఇరవై నిమిషాల్లో గ్రావిూణ నేపథ్యానికి, పెళ్ళి కళను కలపడమనే తెలుగు సినిమాకు మాత్రమే పరిచయమైన అందాన్ని కెమెరాలో బాగా బంధించారు. శ్రవణ్‌ అందించిన మ్యూజిక్‌ చాలా బాగుంది. ఒకట్రెండు పాటలు రొటీన్‌ అనిపించినా, మిగతావి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్‌ బాగానే ఉంది. సెకండాఫ్‌లో కథ మరింత వేగంగా నడవాల్సింది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌, ఆర్ట్‌ వర్క్‌ బాగున్నాయి.
 
విశ్లేషణ:
ముఖ్యంగా ఇది కొత్త కథకాదు. గతంలో వచ్చిన ప్రేమకథల ఛాయలు ఇందులో వున్నాయి. సందీప్‌కిషన్‌, నాని చిత్రాల ఫార్మెట్‌ కథలు గుర్తుకువస్తాయి. హీరోనే మారాడు. హీరోయిన్‌ నెరేషన్‌ కొత్తగా వుంది. ఈ చిత్రానికి హీరోనే మైనస్‌. మరో హీరో అయితే ఈ చిత్రం మరోలా వుండేది. మొదటిభాగం చాలా సరదాగా సాగుతుంది. రెండో భాగం వచ్చేసరికి కాస్త సెంటిమెంట్‌.. బలవంతపు ప్రేమ.. అంటే.. హీరోయిన్‌కు ఇష్టంలేకపోయినా.. హీరో ఆమెను చచ్చినట్లు ఒప్పించే సీన్లు.. ఒక దశలో విసుగుపుట్టిస్తాయి. నారా రోహిత్‌ ఎప్పట్లానే తనదైన డైలాగ్‌ డెలివరీతో బాగా నటించాడు. ఓవైపు కామెడీ పండిస్తూనే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్‌తో నటించే ప్రయత్నం చేశాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌, ఇంటర్వెల్‌ ట్విస్ట్‌, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ ట్విస్ట్ వుంటుంది.
 
సెకండాఫ్‌లో సినిమా నత్తనడకగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే పోసాని కృష్ణమురళి ట్రాక్‌ కొద్దిసేపు నవ్వించినట్లు కనిపించినా, మొత్తంగా చూస్తే అర్థంపర్థం లేని ట్రాక్‌గా కనిపిస్తుంది. రవిబాబు ట్రాక్‌ కూడా అర్థం లేనిదిగానే కనిపిస్తుంది. ఇక కమర్షియాలిటీకి పోయి ఇంట్రడక్షన్‌ సాంగ్‌, కొన్ని అనవసరమైన లెంగ్తీ ఫైట్స్‌, అర్థం లేని కామెడీ లాంటివి సినిమా ఫ్లోను చాలాచోట్ల దెబ్బతీశాయి. ఇక హీరో, హీరోయిన్ల ట్రాక్‌ కూడా కొన్నిచోట్ల క్లారిటీ లోపించింది. సత్యం రాజేష్‌, వెన్నెల కిషోర్‌ పాత్రలు తెలుగు సినిమాల్లో మాత్రమే కనిపించే కామిక్‌ పాత్రలుగా తయారుచేయడం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఓ ఫార్ములా సినిమానే అయినా 'సావిత్రి పెళ్ళి పిచ్చి' అన్న కొత్తదనమున్న ఆలోచన కోసం ఈ సినిమా కొట్టుకుపోతుంది.
 

 
రేటింగ్ 2/5