Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రవితేజ 'టచ్ చేసి చూడు'... రివ్యూ రిపోర్ట్

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (16:20 IST)

Widgets Magazine

టచ్ చేసి చూడు నటీనటులు: రవితేజ, రాశిఖన్నా, సీరత్ కపూర్, మురళీశర్మ, ఫ్రెడీ దారూవాలా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్ తదితరులు. సంగీతం: జామ్ 8, కథ: వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే: దీపక్ రాజ్, నిర్మాతలు: వల్లభనేని వంశీమోహన్, నల్లమలుపు శ్రీనివాస్, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ
 
రవితేజ అనగానే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అనేస్తుంటారు. పైగా మాస్ క్యారెక్టర్లు చేసి మెప్పించే రవితేజ మరోసారి అలాంటి పాయింటునే టచ్ చేశాడు. అలా తెరపైకి విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఈ శుక్రవారం నాడు విడుదలైన చిత్రం టచ్ చేసి చూడు. ఈ చిత్రంలో రవితేజ నటన ఎలా వుంది.. దర్శకుడు టేకింగ్ ఎలా వచ్చింది అనే విషయాలను చూసేందుకు సమీక్షలోకి వెళదాం. 
RashiKhanna-Raviteja
 
కథ
కార్తికేయ(రవితేజ) ఏసీపి. వృత్తి కోసం కుటుంబాన్ని సైతం పట్టించుకోనటువంటి వ్యక్తి. ఓ హత్య కేసులో ఇర్ఫాన్ లాలా(ఫ్రెడ్డీ దారూవాలా)ని షూట్ చేసి చంపడంతో కార్తికేయను సస్పెండ్ చేస్తారు. దీనితో ఉద్యోగాన్ని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేయాలని నిర్ణయించుకుని హైదరాబాద్ వదిలేసి పాండిచ్చేరిలో వుండాలని నిర్ణయించుకుంటాడు. ఐతే తను ఎవరినైతే షూట్ చేసి కాల్చి చంపాడో అతడు బ్రతికే వున్నట్లు తెలుసుకుంటాడు. దీనితో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతాడు. అసలు ఇర్ఫాన్‌కి ఇతడికి మధ్య వున్న వైరం ఏమిటి? కార్తికేయ జీవితంలో జరిగిన ఘటనలు ఏమిటి అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
Raviteja-Seerath
 
విశ్లేషణ: 
యాక్షన్, స్టంట్స్ విషయంలో రవితేజ బాగానే చేసినప్పటికీ అతడి ముఖంలో మాత్రం వయసు ఇట్టే తెలిసిపోతుంది. ఇక హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నాకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. ఐతే తన పరిధి మేరకు గ్లామర్ గా కనబడి ఆకట్టుకుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ గా కనిపించిన సీరత్ కపూర్ పాత్రకు కూడా అంతగా ఇంపార్టెన్స్ లేదు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు నటించేశాయి. 
 
తొలి భాగంలో చిత్రం అంతా ఫ్యామిలీ మధ్య జరుగుతుండటంతో ఫ్లాష్ బ్యాక్ చాలా బలంగా వుంటుందనే అంచనాలకు ప్రేక్షకుడు వస్తాడు. కానీ అతడి అంచనాలను అందుకోవడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడని అనుకోవచ్చు. రొటీన్ కథతో రవితేజను హీరోగా చూపించాడు. రవితేజ డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అతడి పాత సినిమాల్లో మాదిరిగా వుండటంతో చిత్రంలో కొత్తదనం లేదా అనిపిస్తుంది. మొత్తమ్మీద టచ్ చేసి చూస్తే అంతేనన్నట్లుగా వున్నది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారన్నది వేచి చూడాల్సి వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Raviteja Muralisharma Seerat Kapoor Rashi Khanna

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను హీరోయిన్‌ను... నిన్నే పెళ్లాడుతానంటూ యువకులకు టోకరా

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై ...

news

వెంకీకి ఆ హీరోయిన్ కూడా నో చెప్పేసింది... తమన్నా, కాజల్ ఇప్పటికే...

విక్టరీ వెంకటేష్ వృద్ధతరం తారల్లోకి వెళ్లిపోయినట్లేనని తాజా పరిణామాలను బట్టి ...

news

థ్యాంక్యూ చెర్రీ మా కష్టాన్ని గుర్తించినందుకు : చిట్టిబాబుతో భాగమతి

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి టాలీవుడ్ లేడీ జేమ్స్‌బాండ్ అనుష్క నటించిన ...

news

జీఎస్టీ ఎఫెక్ట్ : రాంగోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ...

Widgets Magazine