శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2015 (21:55 IST)

'ఉపేంద్ర-2' ఏం సినిమారా బాబూ...?!! ఉపేంద్రకు అది చాలట... రివ్యూ రిపోర్ట్...

విడుదల: 14.8.2015 శుక్రవారం
ఉపేంద్ర 2 నటీనటులు : ఉపేంద్ర, క్రిస్టినా అఖీవా, పరుల్‌ యాదవ్‌ తదితరులు; సంగీతం: గురు కిరణ్‌, నిర్మాత : నల్లమలపు బుజ్జి, దర్శకత్వం : ఉపేంద్ర
 
ఉపేంద్ర సినిమాలంటే అన్నీ డబ్బింగ్‌ చిత్రాలే. ఎ, రా. హుష్‌, ఉపేంద్ర వంటి చిత్రాలు కన్నడ నుంచి తెలుగుకు వచ్చినవే. అప్పట్లో యూత్‌ మాస్‌ ఈ చిత్రాల్ని చూసి కొందరు ఎంజాయ్‌ చేస్తే, కొందరు పిచ్చి సినిమాలుగా తీర్పు చెప్పారు. అయినా తను తీసేవిధంగా ఉపేంద్ర తీస్తూనే వున్నాడు. 15 ఏళ్ళ క్రితం తీసిన ఉపేంద్రను సీక్వెల్‌గా తీశాడు. అయితే అప్పటి యూత్‌ ఇప్పుడు నడివయస్సుకు వచ్చారు. హీరో కూడా సేమ్‌ టు సేమ్‌. అయినా ఆలోచనలు మారవు. నా చిత్రాలు అర్థం కాకపోయినా చూస్తారని ఇటీవలే స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. మరి దర్శకుడిగా, హీరోగా నిర్మాతగా తనే మారి తీసిన సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
మెదడు అనేది కోతిలా పనిచేస్తుంది. సరిగ్గా ఒక విషయంపై నిలబడదు. దాంతో కొందరు ఊహల్లో భవిష్యత్‌ను ఊహిస్తుంటారు. మరి కొంతమంది గతంలో ఉండిపోతారు. ఎవరైతే గతం, భవిష్యత్‌ అనే ఆలోచన లేకుండా వర్తమానం ఈ క్షణమే సంతోషంగా వుండాలనే ప్రొఫెసర్‌ పలుకులే సినిమాకు మొదలు. దీంతోనే చిత్రం ఎలా వుంటుందో తెలిసిపోతుంది. ప్రొఫెసర్‌ చెప్పిన మాట విన్న క్రిస్టినా అఖీవా అలాంటివాడు ఎవడన్నా ఉన్నాడా అని తెలుసుకోవాలనుకుంటుంది. అలాంటివాడు వున్నాడు. వాడి పేరు నువ్వు(ఉపేంద్ర.. అంటే అది పేరే). అతన్ని వెతుక్కుంటూ ఆమె వెళుతుంది. ఏం జరిగినా, ఎలాంటి సందర్భం ఎదురైనా భయపడకుండా, బాధ పడకుండా, మనీ సంపాదించకుండా ఆ క్షణంలో తనకి తోచింది చేసుకుంటూ జీవిస్తుంటాడు. 
 
అలా ఆయన మాటల్తోనే లక్ష్మీ... నువ్వుతో ప్రేమలో పడుతుంది. పెళ్లి కూడా చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటుంది. కానీ అదే టైంలో షీలా(పరుల్‌ యాదవ్‌) వచ్చి నువ్వు అనే వాడు నిజం కాదని, తనో పెద్ద మోసగాడని చెబుతుంది. లక్ష్మీ ఈ సంకటంలో ఉండగానే సెంట్రల్‌ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్స్‌, మాఫియా డాన్‌ అయిన సలీమ్‌(శోభ్‌ రాజ్‌)లు ఆ నువ్వుని పట్టుకోవాలని ట్రై చేస్తుంటారు. అసలు వీరంతా ఎవరు? ఎందుకని ఉపేంద్రను పట్టుకోవాలనుకుంటారు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
 
పెర్‌ఫార్మెన్స్‌
ఉపేంద్ర క్యారెక్టర్‌ను ఉపేంద్రే చేయాలి. ఎవరివల్లా కాదు. తను ఏం చేసినా.. స్టైయిల్‌గా చేసే ఏక్షన్‌ మాస్‌ను ఆయనలోనే చూస్తారు. ఇందులో తను చేసిన నటన మాస్‌ను అలరిస్తుంది. క్రిస్టినా అఖీవ(గాలిపటం ఫేం) సినిమా మొదటి నుంచి అల్ట్రా మోడరన్‌ గ్లామరస్‌ లుక్‌‌లో కనిపించి తన అందచందాలతో ముందు బెంచ్‌ వారిని బాగానే ఆకట్టుకుంది. ఇక చిన్న పాత్రలో కనిపించిన పరుల్‌ యాదవ్‌ కూడా తన గ్లామర్‌‌తో, పొట్టి పొట్టి బట్టలతో ఆకట్టుకోవడానికే పరిమితం అయ్యింది తప్ప పాత్ర పరంగా పెద్దగా నటించే ఛాన్స్‌ లేదు. సాయాజీ షిండే, శోభ్‌ రాజ్‌, టెన్నిస్‌ కృష్ణ, బ్యాంకు జనార్ధన్‌‌లు తమ పాత్రల పరిధిమేర నటించారు. 
 
టెక్నికల్‌గా...
అశోక్‌ కశ్యప్‌ సినిమాటోగ్రఫీ ఈ సినిమా కోసం ఎంచుకున్న లోకేషన్స్‌ వాటిని చూపించిన విధానం చాలా బాగుంది. గురు కిరణ్‌ అందించిన పాటలు మొదటి పార్ట్‌ ఉపేంద్రలో బాగుంటాయి. ఈ పార్ట్‌2కు ఒక్కటి కూడా తెలుగులో క్లిక్‌ అవ్వలేదు. కానీ నేపధ్య సంగీతం మాత్రం డీసెంట్‌గా ఉంది. ఎడిటర్‌కు ఈ చిత్రం పజిలే. అయితే ఉపేంద్ర మెంటాలటీ తెలుసు కనుక శ్రీ ఎడిట్‌ చేసే సాహసం చేశాడు. తెలుగులో డైలాగ్స్‌ బాగున్నాయి. దర్శకుడిగా ఉపేంద్ర చెప్పాలనుకున్న పాయింట్‌ బాగానే ఉంది, కానీ ఫుల్‌ స్క్రిప్ట్‌ కథనంలో ఆ విషయాన్ని సరిగా చెప్పలేకపోయాడు.
 
విశ్లేషణ:
ఉపేంద్ర సొంతంగా రాసుకునే కథలకు, అందులో క్రియేట్‌ చేసుకునే పాత్రలకు ఆయన తప్ప మరెవరూ న్యాయం చేయలేరు.   నాలుగు డిఫరెంట్‌ అవతారాల్లో ఉపేంద్ర చాలా మంచి నటనని కనబరిచారు. సాఫ్ట్‌ పర్సన్‌, క్రేజీ అండ్‌ రూడ్‌ పర్సన్‌‌గా, సన్యాసిగా, స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌గా, ఇలా 4 డిఫరెంట్‌ గెటప్స్‌‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కూడా గత సినిమాలలానే చాలా స్పీడ్‌గా, మంచి హార్డ్‌ హిట్టింగ్‌ పాయింట్‌తో ఉంటుందని ఆశిస్తారు. కానీ ఇందులో అలాంటివి ఏమీ లేకపోవడం సినిమాకి మొదటి మైనస్‌ పాయింట్‌. సినిమా స్టార్టింగ్‌ బాగున్నా ఆ తర్వాత స్లో అయిపోతుంది, దానికి తోడు చెప్పిన పాయింట్‌‌నే మళ్ళీ మళ్ళీ చెబుతుండడం బోర్‌ కలుగుతుంది. 
 
ముఖ్యంగా కథ కోసం అనుకున్న పాయింట్‌ సినిమాలో చెప్పలేకపోయాడు. కథనంలో ఎక్కువ కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేసాడు. అక్కడివరకూ బాగుంది, కానీ క్లైమాక్స్‌‌లో ఆ కన్ఫ్యూజన్స్‌ని క్లియర్‌ చెయ్యకుండా, ప్రేక్షకుల్ని ముగింపులో సరైన క్లారిటీ ఇవ్వకుండా ముగించేస్తాడు. అంటే పార్ట్‌-3 కూడా వుందేమోననిపించేలా చేస్తాడు. ఇప్పటికే మెంటల్‌ ఎక్కిన ఆడియన్స్‌.. ఏం సినిమారా! అంటూ బయటకు వచ్చేస్తారు. అది చాలు తనకు అంటాడు ఉపేంద్ర. ఇదే పార్ట్‌ వన్‌ సినిమాను కొందరు స్నేహితులకు చూపించినప్పుడు ఇలాగే అన్నారట. మరి ప్రేక్షకులు కూడా అంతే అంటారుమరి. 
 
కనీసం కామెడీ, డైలాగ్స్‌ నాలుగైదు కూడా లేకపోవడం మరో మైనస్‌. ఎంటర్టైన్మెంట్‌ కోరుకుని వచ్చే వారికి పరమ బోర్‌. ఇది సరిపోనట్టు డిఫరెంట్‌ డిఫరెంట్‌ గెటప్స్‌‌‍లో పిచ్చి పిచ్చిగా పాటలు వస్తూనే ఉంటాయి. అవి సినిమా చూసే ఆడియన్స్‌‌కి గుదిబండలా తయారయ్యాయి. సినిమా రన్‌ టైం 135 నిమిషాలే అయినా మనం ఓ మూడు గంటలపైనే ఉన్న సినిమా చూసిన ఫీలింగ్‌ వస్తుంది. అలాగే ఈ సినిమాలో మెయిన్‌ వారు తప్ప మిగతా ఎవ్వరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడం వలన వారిని భరించడం కాస్త కష్టంగా ఉంటుంది. కథనం, కథ, నెరేషన్‌, అన్నీ గందరగోళంగా వున్న ఈ చిత్రం ప్రేక్షకుడికి పజిల్‌ లాంటిదే. 
 
రేటింగ్‌: 2/5