విశాల్, శ్రుతి హాసన్ లకు 'పూజ' దీపావళి వెలుగులను ఇస్తుందా... రివ్యూ రిపోర్ట్

pooja
ivr| Last Modified బుధవారం, 22 అక్టోబరు 2014 (19:51 IST)
పూజ నటీనటులు: విశాల్‌, శ్రుతి హాసన్‌, ముఖేష్‌ అద్వానీ, సత్యరాజ్‌, ప్రతాప్‌పోతన్‌, రాధిక, సూరి తదితరులు; సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, నిర్మాత: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, దర్శకత్వం: హరి.

సినిమా కథలకు మాస్‌ మంత్రం ఉపయోగిస్తుంటారు. అరువు నటులైనా, స్వంత నటులైనా.. దాన్ని ఫాలో అవుతూ... మాస్‌ ఇమేజ్‌తో ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకోవాలని చూస్తుంటారు. అందులోనూ మూలాలు నెల్లూరు అయినా.. చెన్నైలో స్థిరపడిన నటుడు విశాల్‌. స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి సినిమా తీశాడు. యముడు, సింగం చిత్రాలకు దర్శకత్వం వహించిన హరి తమిళ 'పూజై' చిత్రానికి దర్శకుడు. తెలుగులో 'పూజ' పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా బుధవారంనాడు విడుదలైంది. ఆ కథేమిటో తెలుసుకుందాం.

కథ :
వాసు (విశాల్‌) ఓ మార్కెట్‌ యార్డులో వడ్డీవ్యాపారి. తనకో యూత్‌ గ్యాంగ్‌ వుంటుంది. అక్కడే బీహార్‌లో గూండాగిరి చేస్తూ ఇక్కడ మార్కెట్‌లో ఫైనాన్స్‌ చేస్తూ... ఆ ముసుగులో కాంట్రాక్ట్‌ మర్డర్లు చేస్తుంటాడు సింగన్న పాత్రుడు (ముఖేష్‌ అద్వానీ). అనుకోకుండా దివ్య(శ్రుతిహాసన్‌) ప్రేమలో పడతాడు. ముందు తిరస్కరిస్తుంది. స్నేహితులు చెప్పిన వాసు ఫ్లాష్‌బ్యాక్‌ విని ఎట్రాక్ట్‌ అవుతుంది. మరోవైపు ఎస్‌.పి. శివరాం నాయక్‌ (సత్యరాజ్‌)ను సింగన్న చంపడానికి ప్లాన్‌ చేస్తాడు. అతన్ని అనుకోని విధంగా వాసు కాపాడతాడు. అంతేకాకుండా అదే ప్రాంతానికి చెందిన జికె. గ్రూప్‌ కంపెనీ అధినేత కుటుంబాన్ని సింగన్న టార్గెట్‌ చేస్తాడు. అది తెలిసి వారిని రక్షించడానికి వాసు కంకణం కట్టుకుంటాడు. అసలు ఆ ఫ్యామిలీకి వాసుకు లింకేమిటి? వాసు ప్రేమ ఏమయింది? ఎస్‌పి. తనపై జరిగిన ఎటాక్‌కు ప్రతీకారం తీర్చుకున్నాడా? అనేది సినిమా.

పెర్‌ఫార్మెన్స్‌
విశాల్‌ మాస్‌ ఇమేజ్‌ గల నటుడు. తను గతంలో చేసి పందెంకోడి తరహాలోనే యాక్షన్‌ చేశాడు. అప్పటికి ఇప్పటికీ చాలా మెచ్యూర్డ్‌ వుంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ హైలైట్‌గా నిలిచాడు. హీరోయిన్‌గా శ్రుతి రొటీన్‌ పాత్రే. గ్లామర్‌తోపాటు పెర్‌ఫార్మెన్స్‌కు ట్రై చేసింది. 'ఇట్టాగనే....' అనే పాటలో అందాలని ఆరబోసిందనే చెప్పాలి.
ప్రతినాయకుడిగా ముఖేష్‌ అద్వానీ జీవించాడు. సత్యరాజ్‌ పాత్ర అలానే వుంది. పాత్ర చిన్నదే అయినా.. రాధిక పర్వాలేదు.
కమేడిన్‌గా తమిళంలో కొత్తగా వస్తున్న సూరి పాతవారిని మరిపించాడు.

టెక్నికల్‌గా...
ముఖ్యంగా యువన్‌ సంగీతం చెప్పుకోదగినదిగా వుంది. కెమెరా హరి, ఎడిటింగ్‌ విజయన్‌, జై పని బాగుంది. కెమెరా పనితనంలో హరి నిరూపించాడు. కథ, కథనాన్ని కొత్తగా చెప్పాలని దర్శకుడు హరి ప్రయత్నించాడు. అయితే టెక్నికల్‌గా కథను ముందే చెప్పేయడంతో మిగిలిన గమనం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. నిర్మాతగా తన విలువలను బాగా చూపించాడు విశాల్‌.

విశ్లేషణ :
విశాల్‌, హరి కాంబినేషన్‌లో మొదట్లో 'భరణి' వచ్చింది. మళ్ళీ కొంత గ్యాప్‌ తర్వాత వచ్చిన సినిమా ఇది. యాక్షన్‌పై ఎక్కువ శ్రద్ధ కనబర్చాడు. మొదటి భాగం ఎంటరనటైన్‌మంట్‌తో స్లోగా రన్‌ అవుతూ వుంటుంది.
కథానాయకుడు సూపర్‌ హీరోలా చెలరేగిపోతుంటాడు. మొదటి భాగంలోనే కథంతా చెప్పేయడంతో సెకండాఫ్‌లో ట్విస్ట్‌లు పెద్దగా అనిపించవు. దాంతో ఫీల్‌ మిస్‌ అవుతుంది. ఆసక్తి పెద్దగా కన్పించదవు.

హీరో, విలన్‌ను కంట్రోల్‌ చేయడం కోసం తన ప్లాన్‌తో కంట్రోల్‌ చేస్తాడు. యముడు, సింగం చిత్రాలు దర్శకుడి టాలెంట్‌కు ప్రతీకలు. అయితే అరుపులు కేకలు అనేవి ఆ సినిమాలో వున్నా.. అన్నీ.. కథలో స్పీడ్‌తో కొట్టుకుపోతాయి. సూర్య నటనతో మైమర్చిపోతారు ప్రేక్షకులు. పూజలోనూ సేమ్‌గా వుంటుంది. కానీ ఓ దశలో అరుపులు విసుగు తెప్పిస్తాయి. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే రీతిలో కథను రాసుకుని దర్శకుడు తెరకెక్కించేశాడు. ఇలాంటి కథలు బోలెడు వచ్చినా.. హరి స్పీడ్‌ స్క్రీన్‌ప్లేతో మాస్‌ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఏవరేజ్‌ సినిమా ఇది. గతంలో రెండు చిత్రాలు విశాల్‌ను నిరాశపర్చాయి. పూజ ఆ లోటు తీరుస్తుందని అనుకోవచ్చు.దీనిపై మరింత చదవండి :