శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 5 సెప్టెంబరు 2014 (17:44 IST)

వీకెండ్ లవ్... రివ్యూ రిపోర్ట్

వీకెండ్‌ లవ్‌ నటీనటులు: స్వర్గీయ డా|| శ్రీహరి, అదిత్‌, సుప్రియా శైలజ, రావు రమేష్‌, ఎంఎస్‌ నారాయణ, కృష్ణభగవాన్‌, సివిఎల్‌ నరసింహరాజు, పృధ్వి, శ్రీనివాసరెడ్డి, సుభాష్‌, రవివర్మ, ప్రభాస్‌ శ్రీను, రాజశేఖర్‌ గవర, యాంకర్‌ విజయ్‌, ధనరాజ్‌, శివ, సుభాష్‌, తాగుబోతు రమేష్‌, అపూర్వ, శ్రీలలిత, స్వప్నిక, విద్యుల్లేఖ రామన్‌, విష్ణుప్రియ.
 
సాంకేతికత: కెమెరా: జిఎస్‌ రాజ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, పాటలు: అనంత శ్రీరాం, విశ్వ, కాసర్ల శ్యాం, భాగ్యలక్ష్మి, డాన్స్‌: స్వర్ణ, గణేష్‌, నిక్సన్‌, డిఐ: ఎస్‌. సురేష్‌, స్టిల్స్‌: పొలిశెట్టి దేవిసతీష్‌, సహ నిర్మాత: జెర్రిపోతుల ప్రకాష్‌, నిర్మాత: మధు తోట, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: నాగు గవర.
 
పాయింట్‌ : సాఫ్ట్‌వేర్‌ ప్రేమ.
యూత్‌ఫుల్‌ లవ్‌ పేరుతో ఇటీవల చాలా చిత్రాలు వస్తున్నాయి. అందులో సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌డ్రాప్‌గా పలువురు కథలు రాసుకుంటున్నారు. సాప్ట్‌వేర్‌ రంగం అంటేనే సంపాదించడం, పబ్‌ల్లో చిందులేయడం, కొన్నిసార్లు సహజీవనం పేరుతో ఎంజాయ్‌ చేయడం చూపించేస్తున్నారు. దీంతో పెద్దలు కూడా ఇలాగే వుంటారేమో, కల్చర్‌ కూడా పాడు చేస్తున్నారంటూ బాధపడిన సందర్భాలు వున్నాయి. అయితే జర్నలిస్టుగా కెరియర్‌ను ప్రారంభించి దర్శకుడుగా మారిన నాగు గరవ ఎటువంటి విధంగా సాప్ట్‌వేర్‌ వాళ్ళను చూపించాడో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే...
గణేష్‌ (ఆదిత్‌)కు అమ్మాయిలంటే చులకన. ఎలాంటి అమ్మాయినైనా పడేయగలననే ధీమా. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సంధ్య(సుప్రియా శైలజ)ను చూసి టెంప్ట్ అవుతాడు. ఎలాగైనా సంధ్యను పడేయాలనుకుంటాడు. అందుకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కీలక బాధ్యులు తన స్నేహితులే. వారిద్వారా ఉద్యోగం సంపాదించి సంధ్యకు దగ్గరవుతాడు. అనుకున్నట్లుగానే సహజీవనం చేసేట్లుగా తన ఫ్లాట్‌లోకి తీసుకువస్తాడు. అక్కడ కొద్దిరోజులకు కనువిప్పు కలుగుతుంది. అదెలా జరిగింది? తర్వాత కథ ఏమిటి? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌: నటీనటుల పరంగా హీరో ఆదిత్‌ బాగా చేశాడనే చెప్పాలి. రామ్‌లాంటి ఈజ్‌ వుంది అనేకంటే అచ్చు బ్రదర్‌లా వున్నాడని చెప్పవచ్చు. సంధ్యగా సుప్రియి శైలజ కొత్త. చాలా అమాయకత్వంగా పర్వాలేదనిపించినా నటనాపరంగా కొన్నిసార్లు క్వచ్చన్‌ మార్కులు కన్పిప్తాయి ఫేస్‌లో. ఇక శ్రీహరి నటించిన చివరి చిత్రమిది. మిలియనీర్‌గా నటిస్తాడు. సాఫ్ట్‌వేర్‌లో వుంటూ ఏంకర్‌ కావాలనే ఎయిమ్‌ వున్న వాడిగా ఎం.ఎస్‌. నారాయణ పాత్ర నవ్విస్తుంది. అలాగే శ్రీనివాసరెడ్డి వంటి కొన్నియూత్‌ పాత్రలు ఎంటర్‌టైన్‌ చేస్తాయి. 
 
టెక్నికల్‌గా... స్క్రీన్‌ప్లేలో బోర్‌ కల్గించకుండా దర్శకుడు జాగ్రత్త తీసుకున్నాడు. కెమెరా కంటికి ఇంపుగా వుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. సంభాషణలు చాలా సింపుల్‌గా వున్నాయి. సాహిత్యం ఫర్వాలేదు. సంగీతం ఓకే. అయితే ఏ పాత్ర గుర్తిండిపోయే విధంగా అనిపించవు. 
 
విశ్లేషణ :
ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ కలిసి చూసేట్లుగా తీయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే తీసే విధానంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బెటర్‌గా వుండేది. ప్రతిచోట ఫ్రేమ్‌లు కన్పిస్తాయి. కథలో ఇన్‌వాల్వ్‌ అయ్యేవిధంగా ఎక్కడా అనిపించవు. సీన్‌ తర్వాత సీన్‌ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదే దర్శకత్వంలో లోపం. ఎంచుకున్న కథ బాగుంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు అంటే కేవలం సెక్స్‌ కోసం ఆడవాళ్ళను మగవాళ్ళు ఉపయోగించుకోవడం కాదు. బాధ్యత ఎరిగి ప్రేమించాలి అంటూ ఇచ్చిన సందేశం బాగుంది.
 
సంభాషణలు కాజువల్‌గా వున్నాయి. అంతా కొత్తవారైనా ఏదో ఒక షాట్‌లో సీనియర్స్‌ వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. దాంతో ఆర్టిస్టులు చాలామంది వున్నారనే ఫీలింగ్‌ మినహా వారివల్ల సినిమాకు అదనపు ఉపయోగం ఏమీ అనిపించదు. యూత్‌ చిత్రాల పేరుతో ఇప్పుడు వస్తున్న బూతు చిత్రాల కంటే బెటర్‌ అయిన సినిమా. కమర్షియల్‌గా సక్సెస్‌ కావడం కష్టమే మరి.