సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (16:39 IST)

'ఆచార్య' రూపంలో మెగా సర్‌ప్రైజ్ ... 'ధర్మస్థలి' దద్ధరిలిపోయింది..

మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు వేడుకలను ఆగస్టు 22వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆచార్య రూపంలో దర్శకుడు కొరటాల శివ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మెగా అభిమానులంతా వేయి కళ్లతో ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘ఆచార్య’ మూవీ నుంచి, మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. 
 
శనివారం సాయంత్రం 4గంటలకు చిత్రయూనిట్ ‘ఆచార్య’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. చిరు నుంచి అభిమానులు ఏం అయితే కోరుకుంటారో.. అదే రివీల్ చేస్తూ.. మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక సమస్య కోసం పోరాడుతున్న యోధుడిలా ఈ పోస్టర్‌లో చిరు ఉన్నారు.
 
అలాగే ధర్మస్థలి అనే గ్రామం చూపిస్తూ.. కొందరు పేదవారు దీనంగా చూస్తుంటే.. అన్యాయం చేసేవారిని చిరు పైలోకాలకు పంపిస్తున్నట్లుగా ఈ మోషన్ పోస్టర్‌లో చూపించారు. ఇక మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పేదేముంది.. అరిపించేశాడు. మొత్తంగా చూస్తే.. ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా కొరటాల తెరకెక్కిస్తున్నట్లుగా అర్థం అవుతుంది. 
 
కాగా, ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.