బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (18:20 IST)

ఈగల్ సంక్రాంతికి అందరినీ అలరిస్తుంది కుమ్మేద్దాం : రవితేజ

Ravi Teja- Kavya Thapar - Anupama Parameswaran- Navadeep and others
Ravi Teja- Kavya Thapar - Anupama Parameswaran- Navadeep and others
మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండూ రవితేజను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు లాంచ్  చేశారు.
 
అనంతరం మహారాజా రవితేజ మాట్లాడుతూ..ఈగల్ కి అద్భుతమైన సౌండ్ ఇచ్చాడు దావ్‌జాంద్. ఖచ్చితంగా ప్రేక్షకులు కొత్త అనుభూతిని ఫీలౌతారు. కార్తిక్ రూపంలో మరో మంచి దర్శకుడు రాబోతున్నాడు. సినిమా చాలా బావుంటుంది. తనకి మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. హీరోయిన్స్ కావ్య, అనుపమ చక్కగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్ ప్రొడక్షన్ లాంటింది. నిర్మాత విశ్వ ప్రసాద్ గారితో మరొక చిత్రం స్టార్ట్ చేయబోతున్నాం. దీనితో కలసి హ్యాట్రిక్ అయిపోవాలని కోరుకుంటున్నాను. నవదీప్, అవసరాల చక్కగా నటించారు. అజయ్ ఘోస్ గారి పాత్రలో ఇందులో మరో హైలెట్. మామూలుగా నవ్వించలేదు. ఇరగదీశారు, నేను తెగ ఎంజాయ్ చేశాను. మా మాటల రచయిత మణి చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు, చాలా ఇష్టపడి డైలాగ్స్ చెప్పాను. థియేటర్స్ లో కలుద్దాం. జనవరి 13 కుమ్మేద్దాం’’అన్నారు.
 
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. గత ఏడాది రవితేజ గారితో ధమాకా అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాం. ఈ సంక్రాంతి కి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కి రెడీ అవుతున్నాం. ఈగల్ లో మీకు కావాల్సిన యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ అన్నీ వుంటాయి. జనవరి 13న అందరూ థియేటర్స్ లో ‘ఈగల్’ చూడాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
 
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ... కొన్నేళ్ళ క్రితం రవితేజ గారితో పని చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పుడు కుదరలేదు. అయితే మళ్ళీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది ఫైనల్ గా ఈగల్ లో మళ్ళీ ఈ అవకాశం వచ్చింది. రవితేజ గారికి ధన్యవాదాలు. కార్తిక్ తో వర్క్ చేయడం ఇది నాలుగోసారి. టీం అందరికీ థాంక్స్. సంక్రాంతి అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
 
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. రవితేజ గారికి, నిర్మాత విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు. ‘ఈగల్’ పండక్కి గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ జనవరి 13న థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు.  
 
కావ్య థాపర్ మాట్లాడుతూ.. ట్రైలర్ రిలీజ్ వేడుకని మీ అందరితో జరుపుకోవడం ఆనందంగా వుంది. టీంఅందరికీ థాంక్స్. జనవరి 13 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’అన్నారు.
 
నవదీప్ మాట్లాడుతూ.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా అనిపిస్తోంది. ట్రైలర్ సాంపిల్ మాత్రమే. సినిమాలో చాలా వుంది. అన్నీ దాచాం. ఈగల్ రవితేజ గారిని ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా చూస్తారు. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఈగల్ సంక్రాంతికి ప్రేక్షకుల మనసుని గెలుచుకుంటుంది’’ అన్నారు.
 
శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. రవితేజ గారితో నటించే అవకాశం తొలిసారి వచ్చింది.  రవితేజ గారికి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, కార్తిక్ థాంక్స్’’ చెప్పారు. ఈ వేడుకలో మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
 ఈగల్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
 
తారాగణం: రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర