శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 మే 2023 (07:05 IST)

నాకు మరో అమ్మ దొరికింది : మళ్లీ పెళ్లి ప్రీ రిలీజ్‌ వేడుకలో నరేష్‌

naresh-jayasudha-pavitra
naresh-jayasudha-pavitra
నవరస రాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ 'మళ్ళీ పెళ్లి' హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయిక.  మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన  దర్శకత్వం వహించారు.  విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా దీనిని నిర్మించారు. మే 26న సినిమా విడుదల కాబోతుంది.  ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 
 
అందులో భాగంగా మళ్లీ పెళ్లి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా జరిగింది. కృష్ణ, విజయనిర్మల ఫొటోలకు జ్వోతి ప్రజ్వలన గావించడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం ‘ఆకాశమే..’ అనే సాంగ్‌ను జయసుధ లాంఛ్‌ చేశారు. యాభై ఏళ్లు నటిగా పూర్తిచేసుకున్న జయసుధను నరేష్‌ దంపతులు ఈ సందర్భంగా సన్మానించారు. ఈ వేడుకలో మళ్లీ పెళ్లి చిత్ర బిగ్‌ టికెట్‌ను  జయసుధ లాంఛ్‌ చేశారు. అలాగే నటుడిగా యాభైఏళ్ళు పూర్తిచేసుకున్న నరేష్‌గారిని ఎం.ఎస్‌.రాజు ఆద్వర్యంలో జయసుధ సత్కరించారు.
 
నరేష్‌ మాట్లాడుతూ..  నాబ్యాంక్‌లో ఐదువేలు లేని రోజులు నాకు గుర్తు. నా ప్రాణమిత్రుడు విజయ్‌ నాకు తోడుగా వున్నాడు. నాకు తెలిసి చిన్నప్పుడు కృష్ణ, విజయనిర్మలగారిని చూసేందుకు తిరుపతి గుండెతో అభిమానులు దర్శించుకునేవారు. 9వ ఏట పండంటి కాపురంతో అనుకోకుండా నా నటన ప్రారంభమైంది. ఎస్‌.వి.రంగారావు, గుమ్మడి, జయసుధగారితో కలిసి పయనమే ఇప్పుడు 50వ  ఏట హెల్దీగా నటుడిగా కొనసాగుతున్నానని అనిపిస్తుంది.  మా అమ్మ నాతో నీకు మంచి లైఫ్‌ ఇవ్వలేకపోయాను అని చివరిలో అంది. ఇప్పుడు నేను ఇంకో అమ్మని కలిశాను అని చెప్పి కృష్ణగారి ఆశీస్సులు తీసుకున్నాను. ఫస్టాప్‌ బాగుంటే సెకండాఫ్‌ బాగుంటుంది. అదే ఈ సినిమా.

కృష్ణ, విజయనిర్మలగారు నాకు ధైర్యాన్ని నేర్పారు. ఆ సమయంలో నా కుటుంబమంతా నావైపు నిలబడింది. మా అమ్మ ఓ దేవత. ఆమెనుంచిచాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. రీల్‌ లైఫ్‌ బాగున్నా రియల్‌ లైప్‌ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్ళకు మా అమ్మ తర్వాత ఇంకో అమ్మను కలుసుకున్నా. పెండ్లిలో నమ్మకం, ఆప్యాయత, తోడును కోరుకుంటాం. వృద్ధాప్యంలో బలాన్ని కోరుకుంటాం. అందుకే చివరికి నా గమ్యానికి చేరుకున్నానని చెప్పగలను.

నా గురువు జంథ్యాలగారు మంచి మిత్రులు. ఆయన సినిమాలతో అన్నీ హిట్లు కొడుతూనే వచ్చాను. నాకు నచ్చింది నేను చేస్తాను. మా అమ్మ గుడికి వెళ్ళి అమ్మ కళ్ళలో చూస్తాను. నాకు ఆలోచన వస్తుంది అదే చేస్తాను.  రాజకీయాల్లోకి వెళ్ళాను. సేవా కార్యక్రమాలు చేశాను. ఒక సిద్ధాంతంతొ బిజెపిలో పనిచేశాను. అయినా తృప్తిలేదు. మరలా కళామతల్లివైపు వచ్చాను. నన్ను మెచ్చిన దర్శక నిర్మాతలు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. నేను రోజూ వ్యాయామం చేస్తాను.మైండ్‌ ఆరోగ్యంగా వుంటే మనం ఆరోగ్యంగా వుంటాం. పదిమందికి మంచి చేయాలి. అదే లైఫ్‌. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో మంచి పనికోసం పనిచేశాను. సభ్యుల సహకారంతో ముందుకుసాగాను. 
 
ఒకప్పుడు ఎం.ఎస్‌.రాజుగారి సినిమాలో నటించాలకునేవాడిని. అలా వదిన వరస అయినా జయసుధ తో వాన సినిమాలో భార్యభర్తలుగా చేయించారు.  డర్టీహరీ సినిమా చూశాక అందులో యంగ్‌ మాన్‌ ఆయనలో కనిపించాడు. ఆయనతో కొంతకాలం జర్నీ చేశాక ఓ కథ వినిపించారు. బాగా నచ్చి వెంటనే చేద్దాం అన్నా. అమ్మ కోరికమేరకు విజయకృష్ణ గ్రీన్‌ స్టూడియో స్థాపించాం. ఇక ఈ సినిమా ఎం.ఎస్‌.రాజుగారు  కాకపోతే మొదలయ్యేదికాదు. ట్రైలర్‌లో కొద్దిగానే చూశారు. విడుదలయ్యాక ఆటంబాంబ్‌పేలుతుంది. మే26న యు.ఎస్‌.ఎ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో విడుదల కాబోతుంది. ఇది తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తీశాం. వనితా పాత్రద్వారా సూర్యకాంతం ఛాయాదేవి మనకు వచ్చిందని అనుకుంటున్నా. అరుణ్‌దేవ్‌,అనంత్‌ శ్రీరామ్‌, సురేష్‌ బొబ్బిలి బాగా పనిచేశారు అని అన్నారు.