మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (18:15 IST)

ఆలోచింపజేసే థ్రిల్లర్ గా వాస్తవం టీజర్

vaasthavam janta
vaasthavam janta
అంజని సట్ ఫిల్మ్స్(AS Films) బ్యానర్ పై అదిత్య ముద్గల్ నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ వాస్తవం. జీవన్ బండి రచన, దర్శకత్వం వహించిన స్వచ్ఛమైన క్రైమ్ థ్రిల్లర్. దర్శకుడు జీవన్ బండికి క్రైమ్ థ్రిల్లర్స్ సబ్జెక్ట్ లను డీల్ చేయడంలో విభిన్నమైన శైలి ఉంది. సినిమాటిక్ గా కాకుండా చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కీలక సన్నివేశాలతో అత్యంత ఉత్కంఠతను కొనసాగిస్తూ.. పతాక సన్నివేశం వరకు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టగలిగే సమర్థుడు జీవన్ బండి. ప్రేక్షకులకు విభిన్నమైన థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇవ్వాలని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి వాస్తవం కథను రాసుకున్నారు. వాస్తవం చిత్రానికి  సంబంధించిన టీజర్ యూట్యూబ్ అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడారు.  
 
సినిమా తీయడం అంటే పేపర్ మీద కథ రాసుకున్నంత సులువు కాదు. రాసుకున్న కథను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం అంటే దర్శకుడు ఒక యుద్ధమే చేస్తాడు. కానీ వాస్తవం టీమ్ సపోర్ట్ వలన ఈ కథను చాలా అద్భుతంగా తెరకెక్కించామని డైరెక్టర్ జీవన్ బండి వెల్లడించారు. ప్రేక్షకులకు ప్రతీ సన్నివేశం నచ్చాలి అని ఎక్కడా రాజీపడకుండా జాగ్రత్తగా ప్రతీ సీక్వెన్స్ డిజైన్ చేశామన్నారు. ఇక ప్రతీ సీన్ ప్రేక్షకుడి ఊహకి మించి వచ్చిందని అన్నారు. అతి త్వరలో థియేటర్లలోకి సినిమా రాబోతుంది, ప్రేక్షకులు ఖచ్చితంగా ఒక రియలిస్టిక్ 
థ్రిల్లర్ అనుభవాన్ని ఫీల్ అవుతారని, ఆద్యాంతం సీటు అంచున కూర్చునే విధంగా సినిమా ఉంటుందని ఎంతో నమ్మకంతో జీవన్ బండి చెప్పారు. 
 
అలాగే నిర్మాత ఆదిత్య గురించి మాట్లాడుతూ.. ఎంతో ఔత్సాహిక దర్శకులకు ఆయన దేవుడిచ్చిన వరం. సినిమాను చిత్రీకరించడంలో పూర్తి స్వేచ్చను ఇచ్చారు. నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు, ఏది అడిగినా కదనలేదు కాబట్టే వాస్తవం టీమ్ నుంచి ఇంత మంచి ఔట్ పుట్ వచ్చిందని పేర్కొన్నారు. ఇక థ్రిల్లర్ సినిమాలకు సంగీతం వెన్నెముకగా నిలుస్తుంది. సంగీత దర్శకుడు పిఆర్ అద్భుతంగా పనిచేశారు. పాటలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని వెల్లడించారు. 
 
చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అందరు కొత్తవాళ్లను పెట్టుకొని సినిమాను ఎలా ప్రమోట్ చేస్తారు అని కానీ వాటికి సమాధానం చెప్పడం కన్నా విడుదల చేసి దాని ఫలితాన్ని సమాధానంగా చూపించాలి అనుకుంటున్న అని డైరెక్టర్ జీవన్ బండి అన్నారు. ఈ మాటలు ఎంతో నమ్మకంతో చెబుతున్నా.. నా సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నాకు ఏం కావాలో క్లారిటీ ఉంది అన్నారు. సినిమాలో నటీనటులందరూ అద్భుతంగా చేశారు. సినిమా చూసిన తరువాత వారిని మెచ్చకోకుండా ఉండలేరు. 
 
చివరిగా అసలు ఈ జర్నీ ఎలా మొదలైందంటే.. ఒక రోజు ఇన్ స్టాగ్రామ్ లో రైటర్స్ కావాలి అనే పోస్ట్ చూసి మెస్సెజ్ చేశా. తరువాత మంచి కథ ఉంటే చెప్పు ప్రొడ్యూస్ చేద్దాం అన్నారు. దీనికంటే ముందు సినిమాటిక్ రేంజ్ లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశా, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా, చాలా మందికి కథలు చెప్పాను కొంత మంది బడ్జెట్ ప్రాబ్లమ్స్ వలన ముందుకు రాలేదు. అలాంటి సమయంలో ఆ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ నేడు ఇలా మీ ముందు నన్ను మాట్లాడేలా చేసిందని జీవన్ బండి పేర్కొన్నారు. జూమ్ కాల్ లోనే కథను నెరెట్ చేశా, తెలుగు వాళ్లే చేయలేదు ఎక్కడో ఢిల్లీలో ఉన్న పర్సన్ చేస్తాడా అని అనుకుంటున్న సమయంలో.. కథ వినగానే ఇది మనం చేస్తున్నామన్నారు. అలా మొదలైంది. సినిమా పూర్తి అయేంత వరకు ప్రొడ్యూసర్ అదిత్యను ఒక్కసారి కూడా నేరుగా కలువలేదని, అయినా ఆయన నామీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తికి ఒక మంచి సినిమా ఇవ్వాలని అహర్నిషలు సినిమా కోసం తపించా, నా టీమ్ కూడా చాలా కష్టపడ్డారు అని డైరెక్ట్ర జీవన్ బండి అన్నారు. ఇక ఫైనల్ గా కథను, నన్ను నమ్మి సినిమా తీయడానికి ముందుకొచ్చిన నిర్మాత అదిత్య ముద్గల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.