శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By
Last Updated : గురువారం, 13 జూన్ 2019 (19:25 IST)

#Manmadhudu2Teaser ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్ (Video)

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున, అక్కినేని నాగార్జున తాజా సినిమా మన్మథుడు-2. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ''నీకు షట్టర్లు మూసేసి దుకాణాలు సర్దేసే వయసొచ్చేసింది’ అని ప్రముఖ నటి దేవదర్శిని.. నాగ్‌ను ఉద్దేశిస్తూ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇంకా పెళ్లి చేసుకోలేందంటూ నాగ్‌ తల్లి(దేవదర్శిని), బామ్మ (లక్ష్మి) కామెంట్లు చేస్తూ ఉంటారు. 
 
అయితే నాగార్జున మాత్రం పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలతో రొమాన్స్ కానిస్తుంటాడు. టీజర్‌ చివర్లో నాగ్‌ స్టైల్‌గా.. ‘ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. 
 
ఇకపోతే.. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కోడలు సమంత అతిథి పాత్రలో కన్పిస్తోంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ''మన్మథుడు'' చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్‌గా ఈ సినిమా రోబోతుంది. 
 
తాజా ట్రైలర్‌లో ముదురు వయసులో ఉన్న నాగార్జున పెళ్లి చుట్టూ కథను అల్లి చాలా కామెడీగా చూపించారు. ఇంత వయసు వచ్చినా ఆయన ఇంకా వర్జిన్‌గానే ఉండటం.. చుట్టూ ఉన్న వాళ్లు ఆయన్ని ఆటపట్టించడం చాలా ఫన్నీగా చూపించారు. ఇంకేముంది.. మన్మథుడు-2 సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.