గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (16:12 IST)

సూపర్ కాన్ఫిడెంట్, ఉత్సాహంగా ఊరుపేరుభైరవకోన టీమ్

Vi. Anand, Varsha Bollamma,   KavyaThapar, sandeep kishan
Vi. Anand, Varsha Bollamma, KavyaThapar, sandeep kishan
సందీప్ కిషన్, వర్షబొల్లమ్మ, కావ్యతాపర్ నాయకా నాయికలుగా నటించిన సినిమా ఊరుపేరు భైరవకోన. వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించారు. రెండున్నర సంవత్సరాలు నాడు ఈ సినిమా ప్రారంభమైంది. నేడు ఈసినిమా ట్రైలర్ మాదాపూర్ లోని ఎ.ఎం.బి. మాల్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ చూశాక అభిమానులు కేరింతలు కొడుతూ సూపర్ అంటూ కితాబిచ్చారు. దాంతో సూపర్ కాన్ఫిడెంట్, ఉత్సాహంగా ఊరుపేరుభైరవకోన టీమ్ మాట్లాడింది.
 
దర్శకుడు తెలుపుతూ, రెండున్నర సంవత్సరాల శ్రమ మీకు రెండున్నర గంటలు వినోదం, భయం, థ్రిల్ కలిగించేలా చేయబోతున్నాం. ఫిబ్రవరి ౯న విడుదలకానుంది. అందరికీ నచ్చే సినిమా అంటూ తెలిపారు.
 
నిర్మాత రాజేష్‌దండా మాట్లాడుతూ, గరుడ పురాణం బేస్ చేసుకుని భైరవ కోనఅనే కల్పిత అంశాన్ని తీసుకుని సినిమా నిర్మించాం. ఈ ట్రైలర్ నచ్చినట్లే సినిమా కూడా అందరికీ నచ్చుతుంది అన్నారు.
 
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 9 వ తేదీన మా సినిమా విడుదలకాబోతుంది. రవితేజ సినిమా కూడా వున్నా అది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాం అన్నారు.
 
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు విఐ ఆనంద్ గారికి ధన్యవాదాలు. సందీప్ కిషన్ అమెజింగ్ కోస్టార్. గ్రేట్ ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా గొప్పగా నిర్మించారు. శేఖర్ చంద్ర గారు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. నిజమేనే చెబుతున్న పాటకు చాలా అద్భుతమైన రీచ్ వచ్చింది. ప్రేమికులందరికీ థాంక్స్( నవ్వుతూ). ఫిబ్రవరి 9న ప్రీ వెలెంటైన్ ట్రీట్ లా ఈ సినిమాని చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమాలో ప్రేమకథ థ్రిల్ ఇస్తుంది. ఖచ్చితంగా అందరూ థియేటర్స్ లోనే చూడండి. ఇది గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీ'' అన్నారు.
 
హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఇంకా అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రం ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్ లాటి అనుభూతిని అందిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా సపోర్ట్ చేశారు. అందరూ థియేటర్స్ లో సినిమా చూడండి. తప్పకుండ ఎంజాయ్ చేస్తారు'' అన్నారు.