శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:00 IST)

మెస్మరైజ్ చేస్తున్న 'పద్మావతి' ట్రైలర్

బన్సాలీ మళ్లీ వచ్చాడు. ఓ దేవ్‌దాస్.. రామ్‌లీలా.. బాజీరావ్.. ఇప్పుడు పద్మావతి. ఇండియన్ సినిమా హిస్టరీలో తనకు మాత్రమే సాధ్యమైన రిచ్‌నెస్‌తో మరోసారి సినీ లవర్స్‌ను మెస్మరైజ్ చేశాడు.

బన్సాలీ మళ్లీ వచ్చాడు. ఓ దేవ్‌దాస్.. రామ్‌లీలా.. బాజీరావ్.. ఇప్పుడు పద్మావతి. ఇండియన్ సినిమా హిస్టరీలో తనకు మాత్రమే సాధ్యమైన రిచ్‌నెస్‌తో మరోసారి సినీ లవర్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పద్మావతి ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ అగ్ర నటీనటులు దీపికా, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్‌లతో కూడిన ఈ మూవీ.. ట్రైలర్‌తోనే అంచనాలను పెంచేసింది.
 
మూడు నిమిషాల ఈ ట్రైలర్ సంజయ్ లీలా బన్సాలీ ప్యాషన్‌కు అద్దం పడుతున్నది. దీపికా రాణి పద్మినిగా, రణ్‌వీర్ అల్లావుద్దీన్ ఖిల్జీగా, షాహిద్ మహారావల్ రతన్ సింగ్‌గా ఇరగదీశారు. రాజ్‌పుత్‌లను అవమానించారంటూ చాలాసార్లు వాళ్లు అడ్డుకోవడంతో సినిమా రిలీజ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. అయితే వాళ్లను సంతోషపెట్టేలా ఈ ట్రైలర్‌లో రాజ్‌పుత్‌లను ఆకాశానికెత్తే డైలాగ్స్ పెట్టాడు బన్సాలీ. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.