శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 మే 2022 (16:38 IST)

డ‌బ్బుకు విలువిచ్చే స‌ర్కారువారి పాట ట్రైల‌ర్స్ అదుర్స్‌

Sarkaruvari pata trailer poster
Sarkaruvari pata trailer poster
మ‌హేష్‌బాబు స‌ర్కారువారి పాట ట్రైల‌ర్ విడుద‌ల అభిమానుల ఆనందోత్సాహ‌ల మ‌ధ్య హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని భ్ర‌మరాంబిక థియేట‌ర్‌లో సోమ‌వారంనాడు జ‌రిగింది. ట్రైల‌ర్‌లో డ‌బ్బుకు ప్ర‌ధాన్య‌త ఇచ్చే వ్య‌క్తిగా మ‌హేష్‌బాబు న‌టించాడు. పొగ‌రు ఎక్కువ‌గా వుండే హీరో ఓ అమ్మాయి ప్రేమ‌లోప‌డి దిగ‌జారిపోతాడు అనే సీన్స్ ఇందులో వున్నాయి. ఫైన‌ల్‌గా యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపాటుగానే వున్నాయి.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ మాట్లాడుతూ, ట్రైల‌ర్ ఎలా వుంది. అదిరిపోయిందా! సినిమా ఇంకా వంద‌రెట్లు ఎక్కువ‌గా వుంటుంది. ప్రామిస్ చేస్తున్నా. మ‌ర‌లా ప్రీరిలీజ్‌లో క‌లుద్దాం. మీ రెస్పాన్స్ బాగుంది. ఎంజాయ్ చేయండి. రిలీజ్ త‌ర్వాత స‌క్సెస్‌మీట్‌లో క‌లుద్దాం అన్నారు.
 
నిర్మాత్ల‌లో ఒక‌ర‌నైన న‌వీన్ యెర్నేని మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లుగానే సినిమా వంద‌రెట్టు వుంటుంది. మే 12న థియేట‌ర్‌లో చూడండి అన్నారు.