మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (20:18 IST)

#HBDPawanKalyan 'వకీల్ సాబ్' మోషన్ పోస్టర్ ... ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది.. (Video)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్ సాబ్'. దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. లేకుంటే ఈ దసరా పండుగకు ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే, సెప్టెంబరు రెండో తేదీ పవర్ స్టార్ పుట్టినరోజు. ఈ జన్మదినవేడుకలను పవన్ ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. అదేసయంలో పవన్ ఫ్యాన్స్‌కు వకీల్ సాబ్ యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. 
 
పవన్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచో వేచిచూస్తున్న తరుణం రానే వచ్చింది. రెండేళ్ళ త‌ర్వాత న‌టిస్తున్న 'వ‌కీల్ సాబ్‌'కి మూవీకి సంబంధించిన మోష‌న్ పోస్ట‌రను చిత్ర నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ విడుదల చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. లాయర్‌గా ప‌వ‌న్ అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మొత్తానికి ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన పోస్ట‌ర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది.
 
కాగా, బాలీవుడ్ చిత్రం 'పింక్' రీమేక్‌గా రూపొందుతున్న 'వకీల్ సాబ్' సినిమా డ్రామా ఎంటర్‌టైనర్. ఇందులో పవన్ కళ్యాణ్, నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు.
 
తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ జాతీయ స్థాయిలో హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ నుంచి అజిత్, విజయ్ ఫ్యాన్స్ క్లబ్‌లు సైతం ఈ ట్రెండ్‌లో పాల్గొనడం విశేషం.