సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 6 జులై 2024 (20:28 IST)

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

Vijay Antony, Megha Akash
Vijay Antony, Megha Akash
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్.

"తుఫాన్" సినిమాను ఈ నెల 26వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఇటీవల విడుదల చేసిన "తుఫాన్" ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
 
మాటల, పాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ, "తుఫాన్" ఒక మంచి సినిమా. మీరంతా విజయ్ ఆంటోనీ గారి బిచ్చగాడు సినిమాను ఎంతగా ఎంజాయ్ చేశారో "తుఫాన్"  సినిమాను కూడా అలాగే ఆస్వాదిస్తారు. అన్నారు.
 
నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ - "తుఫాన్" సినిమా టీజర్, ట్రైలర్ మీరంతా చూశారు. మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నా. ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ను ఇలా మీ అందరి మధ్యలో గ్రాండ్ గా నిర్వహించాలని కోరుకున్నాం. మీరంతా వచ్చినందుకు సంతోషంగా ఉంది. "తుఫాన్" సినిమా యాక్షన్, ఎమోషన్ వంటి అన్ని అంశాలతో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లాగే సినిమానూ మీరంతా థియేటర్స్ లో ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ నెల 26వ తేదీన  "తుఫాన్"  సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. అన్నారు.
 
డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ - "తుఫాన్"  సినిమా ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా చేసుకోవడం సంతోషంగా ఉంది. నాకు ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్క కు, విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్. మేఘా ఆకాష్ ఈ మూవీలో చాలా బాగా నటించింది. భాష్యశ్రీ గారు "తుఫాన్"  స్ట్రైట్ తెలుగు సినిమా అనేంత బాగా రచన చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. "తుఫాన్"  మూవీ మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.
 
హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ, "తుఫాన్"  నా కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ. ఈ సినిమాలో లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్, మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి. మీ అందరినీ థియేటర్స్ లో ఎంటర్ టైన్ చేసేందుకు ఈ నెల 26వ తేదీన రిలీజ్ కు వస్తున్నాం. ఈ సినిమాలో విజయ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తప్పకుండా "తుఫాన్"  మూవీ చూడండి. అన్నారు.
 
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ - మీరంతా చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ కు చాలా థ్యాంక్స్. హైదరాబాద్ లో త్వరలో ఒక లైవ్ కాన్సర్ట్ చేస్తాను. "తుఫాన్" ను  ఈనెల 26న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మీతో కలిసి నేనూ ఈ సినిమా థియేటర్స్ లో చూడాలని అనుకుంటున్నా. "తుఫాన్" వంటి మంచి మూవీ నాకు ఇచ్చిన దర్శకుడు విజయ్ మిల్టన్ గారికి థ్యాంక్స్. ఆయన అద్భుతమైన దర్శకుడే కాదు సినిమాటోగ్రాఫర్ కూడా. "తుఫాన్" సినిమాకు ఎక్స్ లెంట్ విజువల్స్ క్యాప్చర్ చేశారు. ఈ సినిమా నేపథ్యం కొత్తగా ఉంటుంది. మేఘా నేనూ పెయిర్ గా ఆకట్టుకుంటాం. మీరంతా "తుఫాన్" సినిమాను ఎంజాయ్ చేస్తారు.