గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (15:07 IST)

నిజమైన ప్రేమను గెలిచే ప్రయత్నమే 'పాగల్' - ట్రైలర్ రిలీజ్

విష్వక్సేన్ హీరోగా నిర్మితమైన చిత్రం 'పాగల్'. నివేద పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా, నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో ఎవరికి పడితే వాళ్లకి ఐ లవ్ యు చెబుతూ ఉంటాడు. అలాటి హీరో ఒక యువతిని మాత్రం నిజంగానే లవ్ చేస్తాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ అమ్మాయి నో చెబుతుంది. ఆమె ప్రేమను పొందడానికి అతను ఏం చేశాడనేదే కథ అనే విషయం ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 
 
ప్రేమ, హాస్యంతో పాటు ఈ సినిమాలో ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు యువతను, అటు మాస్‌ను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ కథను తయారు చేసినట్టుగా తెలుస్తోంది. రథన్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా మారుతుందని అనుకోవచ్చు. నివేద పేతురాజ్‌తో పాటు కథానాయికలుగా సిమ్రన్, మేఘలేఖ కనువిందు చేయనున్నారు.