గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By ttdj
Last Modified: బుధవారం, 5 అక్టోబరు 2016 (14:32 IST)

సింహ వాహనంపై శ్రీవారు... భక్తుడికి సింహబలం ఉంటేనే...(వీడియో)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం యోగ నరసింహ రూపంలో సింహ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. వనరాజు, మృగరాజు సింహం, గాంభీర్యానికి, దక్షతకు ప్రతీక, దుష్టశిక్షణ, శిష్టరక్షణ ఈ వాహన సేవ పరమార్థం. ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం యోగ నరసింహ రూపంలో సింహ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. వనరాజు, మృగరాజు సింహం, గాంభీర్యానికి, దక్షతకు ప్రతీక, దుష్టశిక్షణ, శిష్టరక్షణ ఈ వాహన సేవ పరమార్థం. ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారం నరసింహావతారం.
 
ఆ వృత్తంతాన్ని భక్తులందరికి తెలియజేసేందుకే కలియుగంలో సింహ వాహన సేవ జరుగుతుంది. ఉన్నతమైన ఈ ఆసనానికి సింహాసనమని పేరు. నరోత్తముడు సింహాసనాన్ని అధిష్టించి ప్రజలను, రాజ్యాన్ని సంరక్షిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు. యోగ శాస్త్రంలో సింహం వాహన శక్తికి శీఘ్ర గమనానికి ఆదర్శంగా భావిస్తారు.
 
భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడే భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలడని ఈ సింహవాహన సేవలోని అంతరార్థం. ఈ ఉత్సవంలో వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.