శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2014 (09:03 IST)

బ్రహ్మోత్సవాలు 2014... శ్రీవారి గరుడ సేవ

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టంగా పరిగణించే గరుడోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై వెంకన్న ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు.
 
సకల వేదాలకు మూలపురుషుడు, కలియుగ వైకుంఠనాథుడు మలయప్ప తనకు అత్యంత ఇష్టుడైన గరుత్మంతుని వాహనంగా చేసుకుని తిరుమాడ వీధుల్లో ఊరేగిన తీరు భక్తులను కనువిందు చేసింది. మూలవిరాట్టునికి మాత్రమే అలంకరించే విశేష తిరువాభరణాలతో అలంకృతుడైన వెంకన్నకు కొత్త కళ సంతరించుకుంది.
 
నిత్యసేవల స్వామి సన్నిధిల్లో మూలమూర్తికి మాత్రమే అలంకరించే లక్ష్మీహారం, మకరకంఠి, సహస్రనామావళి హారం, ముఖ్యమంత్రి అందజేసిన కొత్త మేల్ చాట్ వస్త్రాలంకృతులతో ముస్తాబైన శ్రీవారు కొత్తపెళ్లికొడుకువోలే దర్శనమిచ్చారు. శ్రీవారి గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యారు