శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సినీ ఆవకాయ్
Written By pyr
Last Updated : శుక్రవారం, 10 జులై 2015 (21:12 IST)

కేరళలో కనిపించని బాహుబలి హవా.. ఎందుకు?

దేశమంతటా సినిమా రంగం బాహుబలి వైపు చూస్తుంటే, కేరళలో మాత్రం చాలా తక్కువ థియేటర్లలో బాహుబలి ప్రదర్శించబడుతోంది. కొన్ని చోట్ల మాత్రం బాహుబలి విడుదలయ్యింది. ఎందుకు? 
 
సినిమా పైరసీ నిర్మూలనకు కేరళ ప్రభుత్వం తక్షణమే చర్యలను చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. సినిమా పైరసీ నిర్మూలనకు ప్రభుత్వం తక్షణమే ఓ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేస్తూ తమ నిరసన కార్యక్రమాన్ని తీవ్రతరం చేశారు. దీనిలో భాగంగానే గురు, శుక్ర వారాల్లో 400 థియేటర్లను మూసివేశారు. 
 
రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లోని థియేటర్లు మూసి వేయడంతో అది కాస్త తెలుగులో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడి మళయాళంలోకి అనువదించబడ్డ బాహుబలి చిత్రంపై పడింది. దీంతో భారీ బడ్జెట్ వ్యయంతో రూపొందించబడ్డ బాహుబలి చిత్రం దేశ వ్యాప్తంగా విడుదలైంది. కేరళలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో విడుదలకు నోచుకోలేదు.