శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సినీ ఆవకాయ్
Written By PY REDDY
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (22:05 IST)

చిన్నదానా... నీ కోసం టీంకు ... తీరింది... రూ. 6 లక్షలు నష్టపరిహారం

ప్రమోషన్ కోసమని పెద్ద సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసిన చిన్నదానా నీ కోసం .. తీరింది. ప్రేక్షకులు చేసిన ఆకతాయి పనులకు రూ. 6 లక్షల నష్ట పరిహారం చెల్లించాల్సిన స్థితి నెలకొంది. అక్కడ నుంచి ఆడియో సిస్టమ్స్ ను ఇవ్వకుండా ఫంక్షన్ థియేటర్ నిర్వాకులు నిలేస్తున్నారు. ఇంతకీ ఇది జరిగిందెక్కడ.
 
చిన్నదానా.. నీ కోసం బృందం ప్రమోషన్ లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరుపతిలో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసింది. తిరుపతి ఎస్వీయులోని  శ్రీనివాస ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హీరో నితిన్, హీరోయిన్ తో పాటు డైరెక్టర్, సంగీత దర్శకుడు అందరూ వచ్చారు. రాత్రి పొద్దుపోయే వరకూ సంగీత కార్యక్రమాలతో ఆడిటోరియంలో కుర్రకారును ఉర్రూతలూగించారు. స్టేజిపై వారు నృత్యం చేస్తుంటే సీట్లలో కుర్రకారు గెంతులేయడం మొదలు పెట్టింది. రాత్రి వరకూ కార్యక్రమం చాలా బాగా సాగింది. అందరూ హ్యపీ. ఇక తెల్లవారి అక్కడకు వచ్చిన యూనిట్ నిర్వాహకులు తమ సామాగ్రిని తీసుకెళ్ళదామని వస్తే విశ్వవిద్యాలయం అభ్యంతరం చెప్పిందట. 
 
రాత్రి జరిగిన కార్యక్రమంలో ప్రేక్షకులు సీట్లు విరిచేశారని అందుకుగానూ, రూ.6 లక్షలు ఖర్చవుతుందని అది కట్టిన తరువాతే సామాగ్రి తీసుకెళ్ళాలని కోరిందట. కొత్త సీట్లు ఏర్పాటు చేసిన తరువాత తొలి కార్యక్రమం కావడం ఇదే. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఇక్కడ పెద్ద ఆడిటోరియం కూడా ఇదే కావడంతో అధికారులు ఈ మధ్యే దానికి మరత్తులు నిర్వహించారు. చిన్నదానా.. నీ కోసం పుణ్యమాని అవి మళ్లీ పాత స్థితికే వచ్చాయి. దీంతో వర్శిటీ అధికారులు ఆడిటోరియంను బయటి కార్యక్రమాలకు ఇవ్వ కూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.