శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సినీ ఆవకాయ్
Written By pyr
Last Updated : సోమవారం, 18 మే 2015 (08:00 IST)

డాక్టర్ వేధింపులు తాళలేక.. బాలివుడ్ నటి, మోడల్ శిఖ జోషి ఆత్మహత్య

తానో మోడల్, నటి. మరింత అందంగా ఉండడానికి ప్రయత్నించింది. ఇందుకోసం చిన్న చిన్న ప్లాస్టిక్ సర్జీలు చేయించుకోవడం సహజం. అయితే తనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే ఓ డాక్టర్ తనను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. భరించలేక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన భయపడని డాక్టర్ కేసు విత్ డ్రా చేసుకోమని బెదిరించడం మొదలు పెట్టాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమె గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ముంబయిలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
మోడల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ముంబయిలోని ఓ ఆపార్ట్ మెంట్లో చోటుచేసుకుంది. పోలీసులు, ఆమె సోదరుడు విశేష్  చెబుతున్న  వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన శిఖ జోషి అనే మోడల్ బాలివుడ్ నటి కూడా. గత ఎనిమిదేళ్లుగా ముంబయిలో ఉంటోంది. గతంలో శిఖాకు కాస్మోటిక్ సర్జరీలు నిర్వహించే ఓ వైద్యుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, దీంతో ఆమె కేసు పెట్టిందని, ఆ కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరింపులు, ఒత్తిడిలకు గురిచేశారు. దీంతో ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు.
 
మూడు నెలల కిందటే మధు అనే తన స్నేహితురాలు ఇంటికి వెళ్లింది. కొంతకాలంగా తీవ్ర ఒత్తిడికి లోనైట్లు కనిపించిన శిఖా ఉన్నట్లుండి గొంతు కోసుకుని మధు బాత్ రూం వద్ద పడి ఉండటంతో మధు దంపతులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.