అయ్యప్పను దర్శించుకున్న మహిళ భర్త పరార్.. నెటిజన్లు మండిపాటు

Last Updated: బుధవారం, 2 జనవరి 2019 (13:09 IST)
అయ్యప్ప స్వామిని ఇద్దరు మహిళలు దర్శించుకున్న నేపథ్యంలో.. పూజారులు, భక్తులు గర్భగుడికి తాళం వేశారు. 50 వయస్సులోపు వున్న ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున శబరిమలకు వచ్చి పోలీసుల సాయంతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడంపై.. భక్తులు మండిపడుతున్నారు. 
 
ఇద్దరు మహిళలు పోలీసుల సాయంతో బుధవారం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిర్ధారించారు. అయితే అయ్యప్ప ఆలయంలోకి మహిళా భక్తులను పంపి.. కేరళ సర్కార్ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
బుధవారం తెల్లవారు జామున మాత్రం 40ఏళ్ల వయసుగల బింధు, అనే ఇద్దరు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశించారు. స్వామి వారిని దర్శించుకొని బయటికి నృత్యాలు చేశారు. వీరు అయ్యప్పను దర్శించుకొని బయటకు వస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. మహిళలు ఆలయంలోకి అడుగుపెట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. 
 
కేరళ రాష్ట్రం కోయిలుండిలో అయ్యప్పను దర్శించుకున్న మహిళ బిందు ఇంటి వద్ద ఆందోళనలు మొదలయ్యాయి. పరిస్థితిని ముందుగానే పసిగట్టిన బిందు భర్త హరిహరణ్.. కుమార్తెతో కలిసి పరారయ్యారు. ఇంటికి తాళం వేసి ఎక్కడికో పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :