మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (15:35 IST)

2018-టాప్ ట్విట్టర్ ట్రెండింగ్స్.. అత్యధిక లైక్స్, రీ ట్వీట్స్ ఏవి?

2018వ సంవత్సరం సోషల్ మీడియాలో ట్విట్టర్ కీలక పాత్ర పోషించింది. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ తారల వరకు ట్విట్టర్లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం 2018వ సంవత్సరాంతానికి చేరుకున్నాం. ఈ ఏడాది ట్విట్టర్‌ను షేక్ చేసిన అంశాలేంటో ఓసారి పరిశీలిద్దాం.. తాజాగా ట్విట్టర్ ట్రెండ్స్‌లో టాప్-10 జాబితా విడుదలైంది. 
 
ఈ ఏడాది టాప్-10లో ట్రెండ్స్‌లో భారత్‌కు చెందిన ఏడు అంశాలు స్థానం సంపాదించుకున్నాయి. ఇంకా ట్విట్టర్‌లో వైరల్ విషయాలకు వస్తే.. #MeToo అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో #KarnatakaElections, #KeralaFloods, #Aadhaar, #JusticeforAsifa, #DeepVeer, #IPL2018, #WhistlePodu  #AsianGames2018 అనే హ్యాష్‌ట్యాగ్‌లకు స్థానం లభించింది. 
 
అలాగే రీట్వీట్ చేసిన అంశాలేంటంటే.. 2018 ఇంటర్‌కాంటినెంటల్ ట్రోఫీ ఫుట్ పోటీల సందర్భంగా భారత ఫుట్‌బాల్ జట్టు స్కిప్పర్ సునీల్ చౌదరి వీడియో ద్వారా అభిమానులకు మైదానాన్ని క్రీడాభిమానులతో నింపాలని విజ్ఞప్తి చేసిన వీడియోనే అధికంగా రీట్వీట్ అయ్యింది.

ఇంకా ఈ ఏడాది ట్విట్టర్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఓ పండుగ సందర్భంగా దిగిన ఫోటోకు లైక్స్ వెల్లువెత్తాయి. ఈ ఫోటోకు దాదాపు 2,15,000 మంది లైక్స్ వర్షం కురిపించారు. 
 
ఇంకా ట్విట్టర్లో అధికంగా రాజకీయ ప్రముఖుల గురించి చర్చించిన జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. తదుపరి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్‌లు వున్నారు.