గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (20:39 IST)

అధ్వాన్న స్థితికి దేశ ఆర్థిక వ్యవస్థ.. నోట్లపై లక్ష్మి, వినాయకుడి ఫోటో?

Lakshmi
Lakshmi
కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేశుడి ఫొటోలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దేశంలో కష్టాల్లో వుందని.. ఆ కష్టాలు తీరాలంటే.. కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మాగాంధీతో పాటు లక్ష్మీ, గణేశుడి ఫొటోలను ముద్రించాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే  కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోను మార్చాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 
 
నోట్లపై డాక్టర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలనే డిమాండ్ కూడా వస్తోంది. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, మోదీ, లక్ష్మి, వినాయకుడు తదితరుల ఫొటోలను ముద్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 
 
దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వాన్న స్థితికి వెళుతోందని, కాబట్టి వెంటనే కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మి ఫొటోను ముద్రించాలని లేఖలో కోరారు. 130 కోట్ల మంది భారతీయులు కూడా ఇదే కోరుకుంటున్నారని, లక్ష్మీవినాయక స్వామి అనుగ్రహంతో దేశం పురోగమిస్తుందని లేఖలో పేర్కొన్నారు.