గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (15:21 IST)

అక్వేరియం గురించి తెలుసా..?

అక్వేరియం అంటేనే చేపలు గుర్తుకు వస్తుంటాయి. చిన్న అక్వేరియంలో చిన్ని చిన్ని చేపలు ఉంటాయి. పెద్ద అక్వేరియం అంటే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. కొందరికి అక్వేరియం అంటే అసలు తెలియదు కదా.. మరి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
 
బెర్లిన్‌లో రాడిసన్ అనే హోటర్ ఉంది. ఈ హోటల్‌ గురించి చెప్పేందుకు ఏమంత అద్భుతాలు ఉండేవి కావు. కానీ ఇటీవలే కాలంలో ఈ హోటల్‌లో ఇప్పుడు కొత్తగా 82 అడుగుల ఎత్తుగల అక్వేరియాన్ని నిర్మించారు. ఈ అక్వేరియం లిఫ్ట్‌ని తయారుచేశారు. ఈ అక్వేరియానికి వెళ్లిన వారికి వాళ్ల చూట్టూ చేపలే ఉన్నట్లుగా కనిపిస్తాయి. చేపలు చూసేందుకు చాలా అందంగా కూడా ఉంటాయి.
 
అయితే ఈ అక్వేరియంలో 10 లక్షల లీటర్ల గల నీరుని ఉంచారు. ఈ నీటిలో 97 రకాల చేపలు 1500 వరకు ఉన్నాయట. ఈ అక్వేరియాన్ని 2004లో ఇన్వెస్ట్‌మెంట్ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన గింప్ అనే డిజైనర్ దీన్ని డిజైర్ చేశారు. ఎప్పుడు పేరు పొందని ఈ అక్వేరియం ప్రపంచంలో అతిపెద్ద స్థూపాకార అక్వేరియంగా ప్రసిద్ధి చెందింది. 
 
ఈ అక్వేరియంలో లిఫ్ట్ నుండి పైకి వెళ్లి పూర్తి అక్వేరియాన్ని చూస్తే చాలా బాగుంటుంది. లిఫ్ట్‌ను శుభ్రం చేయడానికి, చేపలకు ఆహారాన్ని పెట్టడానికి డైవర్స్ 4 విడుతలుగా ఈ అక్వేరియంలోకి వెళుతారు. దాదాపు 81 కోట్లతో నిర్మించిన ఈ అక్వేరియాన్ని చూడడానికి చాలామంది వస్తుంటారు.