శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (12:24 IST)

తెలంగాణను దాటేసిన ఏపీ, కేవలం 11 గంటల్లో 12 కేసులు, మొత్తం 161

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో దేశంలోనే అట్టడుగు స్థాయిలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజాముద్దీన్ ఘటన చావుదెబ్బ కొట్టింది. అక్కడ నుంచి వచ్చినవారిలో చాలామందికి కరోనా పాజిటివ్ వునట్లు తేలడంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. తాజాగా ఉదయం 9 గంటలకు మొత్తం 161 కేసులు నమోదు కావడంతో తెలంగాణను దాటేసినట్లయింది. 
 
ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, రాష్ట్రంలో 02-04-2020 రాత్రి 10 గంటల తర్వాత నుంచి 03.04.2020 ఉదయం 9:00 వరకు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు 12 నమోదైనట్లు పేర్కొంది. దీనితో తెలంగాణలో నమోదైన 154 కేసుల నుంచి ఏపీ మించిపోయినట్లయింది.