సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 నవంబరు 2021 (12:05 IST)

ఏపీ మూడు రాజధానులు రద్దు: సీఎం జగన్ సంచలన నిర్ణయం

అమరావతి రాజధానిపై రైతులు మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 
దీనిపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నప్పటికీ దాని స్థానంలో కొన్ని మార్పులు చేసి మరో బిల్లును ప్రవేశపెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.