Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెంకన్న సాక్షిగా దీక్ష .. టీడీపీ అంటే ఏంటో దేశానికి తెలియజేస్తాం : చంద్రబాబు

శనివారం, 14 ఏప్రియల్ 2018 (15:59 IST)

Widgets Magazine

వెంకన్న సాక్షిగా ఈనెల 20వ తేదీన చేపట్టనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ దీక్ష ద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో ఒక్క కేంద్రానికే కాదు దేశం యావత్‌కు తెలియజేస్తామని ఆయన అన్నారు.
chandrababu naidu
 
అంబేద్కర్ 127వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, తన పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీన దీక్షను చేపడుతున్నానని ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష సాగుతుందన్నారు. 
 
పార్లమెంటును జరగనివ్వలేదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరాహారదీక్ష చేశారని... పార్లమెంట్ జరగకపోవడానికి కారణం మీదే (బీజేపీ) కదా అని ఆయనను తాను అడుగున్నానని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష చేయబోతున్నానని... తద్వారా కేంద్రం పట్ల నిరసన వ్యక్తం చేస్తానని తెలిపారు. 
 
ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని... ఢిల్లీలో చక్రం తిప్పుతామని ఆయన జోస్యం చెప్పారు. 2019లో మనం మద్దతు ఇచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే... ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. పైగా, తన దీక్ష ద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో యావత్ దేశానికి చూపుదామని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెన్సేషన్ కోసం కాదు.. న్యాయం కోసం పోరాడాలి : శ్రీరెడ్డి వ్యవహారంపై పవన్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేసిన నటి శ్రీరెడ్డి. తన పట్ల మూవీ ...

news

రేప్ చేస్తే కొట్టి చంపేసినా కేసులు పెట్టకూడదు : పవన్ కళ్యాణ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో ఎనిమిదేళ్ళ బాలికపై కొందరు కామాంధులు అత్యంత పాశవికంగా ...

news

బాలికలపై లైంగికదాడికి పాల్పడితే ఉరిశిక్షే : మేనకా గాంధీ ప్రతిపాదన

కేంద్ర మంత్రి మేనకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 12 యేళ్లలోపు బాలికలపై ...

news

ప్రధాని మోడీని దూషించినా.. వ్యతిరేక పాట పాడినా చేతులకు సంకెళ్లే...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య చేసినా సరే శిక్ష ...

Widgets Magazine