శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (14:14 IST)

ఢిల్లీ-బెంగళూరు, గగనతలంలో విమానం ప్రయాణం... ప్రసవించిన గర్భిణి, తల్లీబిడ్డ క్షేమం

బుధవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం గగనతలంలో ప్రయాణం చేస్తుండగా ఓ గర్భిణికి హఠాత్తుగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీనితో ఆమె విమానంలోనే పండండి బాబుకు జన్మనిచ్చింది.
 
వివరాల్లోకి వెళితే... బుధవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి ఇండిగో విమానం బెంగళూరుకు బయలుదేరింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆ విమానంలో వైద్యురాలు శైలజ వల్లభాని వుండటంతో గర్భిణి సుఖప్రసవం జరిగింది. ఇండిగో క్యాబిన్ క్రూ సాయంతో డాక్టర్ శైలజ పురుడుపోసింది.
విమాన ప్రయాణికులు ఎలాంటి ఆటంకం కలుగలేదనీ, మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని అధికారులు తెలిపారు. కాగా విమానం బుధవారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంది. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. తమ విమానంలో ఓ తల్లి బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా వుందని కెప్టెన్ ఆనందం వ్యక్తం చేసారు.