శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By preethi
Last Modified: సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:42 IST)

వామ్మో... బాలాపూర్ లడ్డును అంత పెట్టి కొన్నారా?

సాధారణంగా వినాయకునికి నైవేద్యంగా సమర్పించే లడ్డును చివరి రోజున వేలంపాటలో విక్రయించడం, దాన్ని కొనడానికి భక్తులు పోటీపడటం తెలిసిందే. అయితే ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమై ఈ ఏడాదికి 25 ఏళ్లు ముగిసింది. అంటే సిల్వర్ జూబ్లీ సం

సాధారణంగా వినాయకునికి నైవేద్యంగా సమర్పించే లడ్డును చివరి రోజున వేలంపాటలో విక్రయించడం, దాన్ని కొనడానికి భక్తులు పోటీపడటం తెలిసిందే. అయితే ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమై ఈ ఏడాదికి 25 ఏళ్లు ముగిసింది. అంటే సిల్వర్ జూబ్లీ సంవత్సరం అన్నమాట. ఈ లడ్డూను స్వంతం చేసుకున్నవారు దీనిని తమ పొలాలలో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్మకం ఉండటం వలన ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా లడ్డు వేలం జరుగుతుంటుంది. 
 
మొదట్లో స్థానికులు మాత్రమే ఇందులో పాల్గొనేవారు. తర్వాత్తర్వాత బయటివారికి కూడా ఈ అవకాశం కల్పించడం మొదలైంది. 1994లో మొదటిసారిగా ఈ సాంప్రదాయం మొదలైనప్పుడు ఇది 450 రూపాయల ధర పలికింది, తర్వాతి సంవత్సరమే పదింతలు పెరిగి దీని ధర 4500 రూపాయలు పలికింది. అలా ఒక్కో ఏడాది భారీ స్థాయిలో ధర పెరుగుతూ ఇప్పటికి లక్షల స్థాయికి చేరుకుంది.
 
కాగా ఈ ఏడాది కూడా చాలా తీవ్రమైన పోటీ జరిగింది. చివరికి ఈ 21 కిలోల లడ్డూను బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు స్వంతం చేసుకున్నారు. గతేడాది నాగం తిరుపతి రెడ్డి దీనిని రూ.15.60 లక్షలు చెల్లించి దక్కించుకోగా, గతేడాదితో పోలిస్తే ఒక లక్ష ఎక్కువ పెట్టి మరీ స్వంతం చేసుకున్నారు శ్రీనివాస్ గుప్తా.