బిగ్ బాస్ సీజన్-2.. కిరీటి ఎలిమినేట్.. గీత, గణేష్ సేఫ్ జోన్‌లోకి?

బిగ్ బాస్ సీజన్-2 మూడో వారానికి చేరుకుంది. తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో మూడోవారంలో నటుడు కిరీటి దామరాజు ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లోని అత్యధికులు కిరీటిని బయటకు పంపించాలని నిర్ణయించారు. ఈ న

selvi| Last Updated: సోమవారం, 2 జులై 2018 (11:59 IST)
మూడో వారానికి చేరుకుంది. తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో మూడోవారంలో నటుడు కిరీటి దామరాజు ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లోని అత్యధికులు కిరీటిని బయటకు పంపించాలని నిర్ణయించారు. ఈ నిర్ణం ప్రకారం బయటకు వచ్చిన కిరీటిని బోన్‌లో నిలబెట్టిన హోస్ట్ నాని, కిరీటి మంచి వ్యక్తని చెబుతూ, హౌస్‌లోని కంటెస్టెంట్‌లను కిరీటి గురించి మాట్లాడాలని అడిగాడు. 
 
కిరీటి గురించి తనీష్, బాబు గోగినేని, సామ్రాట్ తదితరులు పాజిటివ్‌గా చెబుతున్న వేళ కిరీటి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తొలివారంలో పర్లేదు కానీ.. రెండో వారంలో కెప్టెన్ టాస్క్‌ తీసుకుని కౌశల్ పట్ల వికృతంగా ప్రవర్తించడం చేశాడు. ముఖ్యంగా ఒక్క ఎపిసోడ్‌లో కిరీటి తన వైఖరితో ప్రేక్షకులకు దూరమయ్యాడని ఈ సందర్భంగా నాని తెలిపాడు. 
 
తాను హౌస్‌లో బాగానే ఉన్నా కూడా ఎలిమినేట్ అయ్యానని కిరీటి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలావుండగా, ఎలిమినేషన్ జాబితాలో గీతా మాధురి, కిరీటి, గణేష్‌లు ఉండగా, గీత, గణేష్ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోవడంతో కిరీటి ఎలిమినేషన్ తప్పలేదు.దీనిపై మరింత చదవండి :