శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (13:08 IST)

ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు... ఇస్రో శాస్త్రవేత్తలకు పదేళ్ళ బుడతడు లేఖ

చంద్రయాన్-2 ప్రయోగం 95 శాతం సక్సెస్ కాగా, చివరి ఘట్టంలో విఫలమైంది. అయినప్పటికీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తల కృషిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. వారిపై దేశం యావత్తూ ప్రశంసల వర్షం కురుస్తోంది. అదేసమయంలో ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అంటూ పదేళ్ళ బుడతడు ఇస్రో శాస్త్రవేత్తలకు రాసిన లేఖ ఒకటి ఇపుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. 
 
ఆ బాలుడు పేరు ఆంజనేయ కౌల్. అతను రాసిన లేఖలో ఉన్న పూర్తి సారాంశాన్ని పరిశీలిస్తే, 'అంత త్వరగా స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద్రుణ్ని చేరుతాం. వచ్చే జూన్‌లో లాంచ్‌ చేయనున్న 'చంద్రయాన్‌-3' మన లక్ష్యం. ఆర్బిటర్‌ ఇంకా అక్కడే (చంద్రుడి కక్ష్యలో) ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అది మనకు ఛాయాచిత్రాలను పంపిస్తుంది. 
 
మనం ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ విత్తనాలను నాటి మొక్కలు పెంచాలో అదే మనకు చెబుతుంది. విక్రమ్‌ ల్యాండయ్యే ఉంటుంది. ప్రజ్ఞాన్‌ పనిచేస్తూ గ్రాఫికల్‌ బ్యాండ్స్‌ను మనకు పంపించేందుకు సిద్ధమవుతూ ఉండి ఉంటుంది. అదే జరిగితే విజయం మనచేతుల్లోనే. తదుపరి తరం పిల్లలకు ఇస్రో శాస్త్రజ్ఞులే స్ఫూర్తిదాయకం. 'ఇస్రో.. నువ్వు మాకు గర్వకారణం', దేశం తరపున ఇస్రోకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్‌ అంటూ ఉంది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.