దాసరి ఆస్తి వివాదం- దాసరి కోడలికి మోహన్ బాబు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు?
దర్శకరత్న దాసరి నారాయణ రావు చనిపోయిన తర్వాత ఆస్తి కోసం కొడుకులు, కుమార్తె, కోడలు మధ్య విభేదాలు రావడం.. మీడియాకెక్కడం తెలిసిందే. ఇటీవల మోహన్ బాబుపై దాసరి కోడలు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చినీయాంశం అయ్యాయి. అయితే... ఫస్ట్ టైమ్ మోహన్ బాబు దాసరి ఆస్తి వివాదం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
దాసరి జయంతి సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన దాసరి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విన్నర్స్‌కు అవార్డులు ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ.... సినీ పరిశ్రమలో దాసరి నారాయణ రావు మహావృక్షం లాంటివారు.
ఆయన ఆస్తి వివాదాలను పరిష్కరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు వివిధ కారణాలు ఉన్నాయని తెలిపారు. దాసరి వీలునామాలో తనతో పాటు మురళీ మోహన్ పేరు రాసి.. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారని వెల్లడించారు. కానీ, అది కొంతవరకు సాధ్యం కాలేదని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమానికి జయసుధ, ఆర్.నారాయణమూర్తితో పాటు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షార్ట్ ఫిల్మ్స్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను, కొంతమంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్ బాబు.. దాసరి ఆస్తి పంపకాల అంశంపై తొలిసారిగా స్పందించారు.
దాసరి నారాయణ రావు ఆస్తి పంపకాల్లో తమకు న్యాయం జరగలేదని ఇటీవల దాసరి కోడలు సుశీల ఆవేదన వ్యక్తం చేసారు. తన మామ దాసరి నారాయణరావు ఆస్తి పంపకాలను మోహన్ బాబు చేతిలో పెట్టారని తెలిపారు. ఆస్తి పంపకాల్లో పెద్ద మనిషిగా ఉన్న మోహన్ బాబు.. నేటివరకు పరిష్కరించలేదన్నారు. తాజాగా మోహన్ బాబు వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యింది. మరి.. మోహన్ బాబు ఎందుకు న్యాయం చేయలేకపోయారో..? ఈ వివాదం ఎప్పటికీ ముగుస్తుందో..?