సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (17:12 IST)

ఆర్ఆర్ఆర్ అవార్డు.. తెలుగు జెండా రెపరెపలాడుతుంది.. వివాదంలో సీఎం జగన్

ys jaganmohan reddy
ఆర్ఆర్ఆర్ గ్లోబస్ అవార్డుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన అభినందన సందేశం వివాదానికి దారితీసింది. ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ అవార్డుపై ఏపీ సీఎం స్పందిస్తూ... వినోద రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఒక తెలుగు చిత్రానికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ అవార్డు తెలుగు సినిమాకు దక్కడం ఏపీ సీఎంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఆనందపరిచింది. ఈ నేపథ్యంలో ఈ అవార్డు తెలుగువారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి సీఎం జగన్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
సీఎం జగన్ అభినందన సందేశంపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి బాగా నచ్చలేదు. జగన్ సందేశం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశభక్తి గీతాలకు, భారతదేశంపై ఉన్న ప్రేమకు పేరుగాంచిన సామి.. ముందుగా మనం భారతీయులమని, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వేర్పాటువాద వైఖరి అనారోగ్యకరమన్నారు.