సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 డిశెంబరు 2020 (15:19 IST)

కరోనా టీకా వేశారు, జస్ట్ చీమ కుట్టినట్లే వుంది అంతే... ఎక్కడ?

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. శీతాకాలం కావడంతో సెకండ్ వేవ్ రూపంలో కరోనా విరుచుకుపడుతుందని భారత్ భయపడుతోంది.
 
ఇదిలావుండగా కరోనా టీకాను అగ్రరాజ్యం అమెరికా రక్షణ విభాగం పెంటగన్ చీఫ్ క్రిస్టఫర్ మిల్లర్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీకా తీసుకోవడంపై చెపుతూ... అస్సలు నొప్పే లేదనీ, జస్ట్ చీమ కుట్టినట్లు వుందని సరదాగా వ్యాఖ్యలు చేసారు.
 
ఫైజర్ ఉత్పత్తి చేసిన ఈ టీకాను అమెరికాలో నర్సు శాండ్రా లిండ్సే తీసుకున్నారు. టీకా పట్ల భయాన్ని పోగొట్టేందుకు అగ్రరాజ్యంలోని అధికారిక బృందం ఇలా టీకాలు వేయించుకుంటూ తాము తీసుకున్న విషయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేస్తున్నారు.