శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (13:37 IST)

బిస్కెట్లో క్రీమ్‌కు బదులుగా టూత్ పేస్ట్.. జైలులో యూట్యూబ్ స్టార్ (video)

స్పెయిన్‌కు చెందిన యూట్యూబ్ స్టార్ ఈఐ జైలు పాలయ్యాడు. ఇల్లు లేకుండా రోడ్డు పక్కన నివసిస్తున్న ఓ వృద్ధుడికి క్రీమ్ బిస్కెట్లో క్రీముకు బదులుగా టూత్‌పేస్ట్‌ను రాసిచ్చాడు. దీన్ని రీసెట్ చేయాలనుకున్నాడు సదరు యూట్యూబ్ స్టార్. ఏదో జాలీ కోసం చేసిన ఈ చర్యతో అతడికి జైలు తప్పలేదు. ఇంతకీ ఏమైందంటే.. టూత్ పేస్ట్ రాసిన బిస్కెట్‌ను తినిన వృద్ధుడు అనారోగ్యం పాలయ్యాడు. 
 
ఈ వ్యవహారం కోర్టు వరకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు రీసెట్‌కు 15 నెలల జైలు, బాధితునికి 22వేల300 అమెరికా డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా రీసెట్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. రోడ్డు పక్కన నివసిస్తున్న వృద్ధుడికి టూత్ పేస్ట్ రాసిన బిస్కెట్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.