గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (16:53 IST)

ఆ ఏనుగుకు ఆకలి.. అంతే కిచెన్‌లోకి ఎంటరైంది.. చివరికి..?

ఆ ఏనుగుకు ఆకలి. అంతే కిచెన్‌లోకి ఎంటరైంది. ఈ ఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. ఆకలితో ఉన్న ఓ ఏనుగు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఒకరి ఇంటి కిచెన్ లోకి ఎంటరైంది. గోడను తన తొండంతో ఎలా నాశనం చేసిందో గానీ.. ఎంచక్కా తన తల అందులో దూరేలా రంధ్రం చేసేసింది. అందులోనుంచి తలను జొప్పించి కింద ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉన్న బియ్యాన్ని లాగించేసింది. 
 
ఇంట్లో ఎదో అలికిడి అవుతున్నట్టు గమనించిన ఆ ఇంటి దంపతులు నిద్ర లేచి చూసేసరికి ఈ నిర్వాకం కనిపించింది. ఫుడ్ ని లాగించేస్తున్న గజరాజును చూసి షాక్ తిన్న వారు.. ఎలాగోలా అతి కష్టం మీద దాన్ని బయటకు వెళ్లగొట్టగలిగారు. అదృష్ట వశాత్తూ అది వారిపై దాడి చేయకుండా దగ్గరలోని చెట్లు, గుట్టల వద్దకు వెళ్ళిపోయింది. 
 
తమ ఇంటి కిచెన్ గోడ దాదాపు పూర్తిగా పడిపోయిందని, ఇప్పుడు మళ్ళీ గోడ కట్టాలంటే ఎక్కువే ఖర్చవుతుందని వాళ్ళు బావురుమంటున్నారు. కష్టపడి గోడ కట్టిస్తే మళ్ళీ రాదన్న నమ్మకమేమిటని వాపోతున్నారు.