శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (14:24 IST)

గూగుల్ సంచలన నిర్ణయం : కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నవారికే వేతనం

ప్రముఖ టెక్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు విధిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికే వేతనాలు ఇస్తామని సంచలన ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఇందుకోసం గూగుల్ కంపెనీ ఉద్యోగుల కోసం కొత్త కోవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీని పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీకా వేసుకోని ఉద్యోగులకు వేతనాల్లో కోత విధిస్తామని, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని తెలిపింది. ఈ మేరకు గూగుల్ యాజమాన్యం మెమో జారీ చేసినట్టు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సీఎన్‌బీసీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. 
 
వచ్చే యేడాది జనవరి 18వ తేదీ నాటికి సంస్థలోని ప్రతి ఒక్కరూ కంపెనీ వ్యాక్సినేషన్ పాలసీని పాటించాలి గూగుల్ స్పష్టం చేసింది. అప్పటికీ దీనిని ఉల్లంఘిస్తే 30 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవుపై పంపిస్తామని, ఆ తర్వాత ఆరు నెలల వరకు వ్యక్తిగత సెలవు ఇచ్చి విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్టు ఆ కథనం వెల్లడిస్తుంది.