ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 జూన్ 2022 (20:49 IST)

Father's Day: ఓ నాన్నా... నీ మనసే వెన్నా... అమృతం కన్నా అది ఎంతో మిన్నా....

Fathers Day
స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గారు నటించిన ధర్మాదాత చిత్రంలో... ఓ నాన్నా అనే పాట తండ్రి స్థానం ఎలాంటిదో చెప్తుంది. సంతానం సుఖసంతోషాల కోసం తండ్రి పడే పాట్లు ఎలాంటివో చెప్తుంది. ఈ పాటకు డాక్టర్ సి. నారాయణరెడ్డిగారు సాహిత్యాన్ని అందించగా టి. చలపతిరావు గారు స్వరపరిచారు. ఘంటసాల వెంకటేశ్వర రావు, జయదేవ్, సుశీల గార్లు ఆలపించారు.

 
ఓ నాన్నా.....ఓ నాన్నా
ఓ నాన్నా నీ మనసే వెన్న
అమృతం కన్నా అదిఎంతో మిన్న
ఓ .....నాన్న ఓ నాన్న

 
ముళ్లబాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ముళ్లబాటలో... నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో

 
ఏ పూట తిన్నావో... ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి ఉంచావు
ఓ ..... నాన్న ఓ నాన్న

 
పుట్టింది అమ్మకడుపులోనైనా
పాలుపట్టింది నీచేతిలోనా
పుట్టింది అమ్మకడుపులోనైనా
పాలుపట్టింది నీచేతిలోనా
ఊగింది ఉయ్యాలలోనైనా
ఊగింది ఉయ్యాలలోనైనా
నేనుతాగింది నీ చల్లని ఒడిలోన
చల్లని ఒడిలోన
ఓ నాన్నా నీ మనసే వెన్న
అమృతం కన్నా అదిఎంతో మిన్న
ఓ..... నాన్న ఓ నాన్న

 
ఉన్ననాడు ఏమిదాచుకున్నావు
లేనినాడు చేయిచాచనన్నావు
ఉన్ననాడు ఏమిదాచుకున్నావ
లేనినాడు చేయిచాచనన్నావు
నీరాచగుణమే మామూలధనము
నీరాచగుణమే మామూలధనము
నీవే మాపాలి దైవము
ఓ నాన్నా నీ మనసే వెన్న
అమృతం కన్నా అదిఎంతో మిన్న
ఓ .....నాన్న ఓ నాన్న