గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (14:14 IST)

ఐఐటీ కాన్పూర్ విద్యార్థులా.. లేక రౌడీలా.. కుర్చీలతో?

IIT Kanpur
IIT Kanpur
ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విద్యార్థులు కుర్చీలతో చావబాదుకున్నారు. వైఎంసీఏ-ఎన్ఎస్‌యూటీ జట్ల మధ్య ఈ ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. 
 
ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ, ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకుంటూ బీభత్సం సృష్టించారు. వార్షిక క్రీడా వారోత్సవంలో భాగంగా శనివారం జరిగిన కబడ్డీ పోటీలో ఈ ఘటన జరిగింది. ఈ గొడవ తర్వాత రెండు జట్లపై అనర్హత వేటు వేశారు.