సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:15 IST)

ఒక్క విమానంలో 640 మంది.. ఫొటో వైరల్‌

600 Afghans
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో.. అక్కడి ప్రజలు ప్రాణ భయంతో కాబూల్‌ విమానాశ్రయానికి పరుగులు తీశారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు అక్కడ కనిపించిన ప్రతి విమానంలోకి ఎక్కారు. విమానాలు కాస్తా.. బస్సుల్ని తలపించాయి. 
 
ఆఖరికి విమానం రన్‌వేపై ల్యాండవుతుండగానే వందలాది మంది విమానంలోకి ఎక్కారు. వెళ్లలేనివాళ్లు.. విమానం టైర్లను పట్టుకొని కూర్చున్నారు. అలా విమానం పైకి ఎగరగానే ముగ్గురు కిందపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విచారకర సంఘటన జరిగిన ఆ విమానంలో ఎంతమంది ఎక్కారో తెలుసా..?! ఏకంగా ఆ విమానంలో 640 మంది ఆఫ్ఘన్లు ఎక్కారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి-17 కార్గో విమానం. విమానంలో కిక్కిరిసి కూర్చున్న జనం ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
దీనిపై అమెరికా రక్షణ అధికారులు మాట్లాడుతూ.. 'అంతమందిని తీసుకెళ్లే ఉద్దేశం మాకు లేదు. అయినా ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో విమానంలోకి ఎక్కిన ఎవరినీ కిందకు దించలేదు. ఆ 640 మందిని ఖాతార్‌లో సురక్షితంగా దించాము' అని అన్నారు.