Husband Cries: లేబర్ వార్డుకు వెళ్లిన మహిళ.. కన్నీళ్లు పెట్టుకున్న భర్త.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రిలో తన భార్య లేబర్ వార్డుకు వెళ్లింది. దీంతో భార్య కోసం భర్త కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన భార్య తన బిడ్డకు జన్మనివ్వడం కోసం ఆమె పడే బాధలు చూసి.. భార్య కోసం ఆ భర్త భావోద్వేగానికి లోనైయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో ప్రయాగ్‌రాజ్‌లో నివసిస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉమ్ముల్ ఖైర్ ఫాత్మా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆయనకు 1.6 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫుటేజ్ భావోద్వేగానికి లోనైన భర్త బాధకు అద్దం పడుతోంది.
తన బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావడానికి తన భార్య అనుభవించే బాధను ఆ భర్త గుర్తించాడు. ఆ వ్యక్తి బాధను చూసి వైద్య సిబ్బంది ముందు ఏడవడం ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా భార్యపై ఆ వ్యక్తి కలిగివున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు.