బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (17:37 IST)

వీడియో కాన్ఫరెన్స్‌లో భర్త.. ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన భార్య.. వైరల్

Kiss on zoom call
లాక్‌డౌన్ కారణంగా ఎక్కువగా వీడియో కాన్ఫరెన్సింగ్‌కే అలవాటు పడ్డారు ఉద్యోగులు. ఇలాంటి మీటింగ్స్‌లో ఎన్నో సరదా సన్ని వేశాలు జరుగుతున్నాయి. అవి వైరల్ అవుతున్నాయి. అలాంటి మరో వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి జూమ్ కాల్ మీటింగ్‌లో ఉండగా భార్య వచ్చి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించడం రికార్డ్ అయింది. ఇంతలో భర్త వారించడంతో ఆమె వెనక్కి వెళ్లిపోయింది. అంతే... ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను ట్వీట్ చేశారు.
 
ఈ వీడియో మూడున్నర లక్షల మందికి పైగా చూశారు. వేల మంది లైక్ చేశారు. రీట్వీట్లు, కామెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ట్వీట్‌పై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ లేడీని వైఫ్ ఆఫ్‌ ది ఇయర్‌గా నామినేట్ చేస్తానని, ఒకవేళ ఆ భర్త సంతోషించి ఉంటే కపుల్ ఆఫ్ ది ఇయర్‌గా నామినేట్ చేసేవాడినని ఆనంద్ మహీంద్రా అన్నారు.
 
ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జూమ్ కాల్‌లో, గూగుల్ మీట్‌లో ఇలాంటి సరదా సన్నివేశాలెన్నో రికార్డ్ అవుతున్నాయి. అందరూ ఇంట్లోనే ఉంటూ, ఇంటి నుంచే పనిచేస్తూ, ఆఫీస్ మీటింగ్స్‌కి అటెండ్ అవుతుండటం వల్ల ఈ కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి.