మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (12:29 IST)

పవర్ స్టారే ఆ పదవికి అర్హుడా? బిజెపి అదే ఆలోచిస్తుందా? (Video)

ఎపిలో మరో నాలుగేళ్ళలో ఎన్నికలు జరుగుతాయి. అంతకన్నా ముందుగా పార్టీలను బలోపేతం చేయాలి. ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది కేంద్రంలో బిజెపి నేతల ఆలోచన. అందుకే ఎపి వైపు కేంద్ర పెద్దలు చూస్తున్నారు. కొంతమంది ముఖ్య నేతలు అదే దిశగా ఆలోచన కూడా చేసేస్తున్నారు. 
 
అందుకే బిజెపి ఎపి అధ్యక్షుడిగా కొత్తగా సోము వీర్రాజును నియమించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే బిజెపి.. జనసేన పార్టీలు రెండు కలిసికట్టుగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని పెడితే జనం బాగా స్పందిస్తారన్న ఆలోచనలో బిజెపి ఉందట.
 
ఇదే విషయాన్ని జనసేన అగ్రనేతలతో కూడా బిజెపి మాట్లాడిందట. అయితే గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు రాలేదు. జనసేన ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో ఎదురైన పరిస్థితి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదన్నది బిజెపి ఆలోచనగా వుందట.
 
అందుకే ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే సిఎం అభ్యర్థిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును ఖరారు చేయాలని బిజెపి అధిష్టానం భావిస్తోందనీ, సఖ్యతగా ఉన్న పార్టీలో సిఎం అభ్యర్థి వ్యవహారం ఎలాంటి గొడవలకు దారి తీయకూడదన్నది బిజెపి నేతల ఆలోచనగా వుందని చెప్పుకుంటున్నారు. దీనికి జనసేన ముఖ్య నేతలు కూడా ఒప్పుకున్నారట. ఇక బిజెపి నేతలంటారా అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక మనదేముందిలా అనుకుని సరిపెట్టుకుంటున్నారట. మరి ఇది నిజమో కాదా తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.