గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (12:15 IST)

ఒకే కుటుంబంలో నలుగురు పిల్లలు ఐఏఎస్ - ఐపీఎస్‌లు.. ఎక్కడ?

childerns  iap ips
వారంతా ఒకే తండ్రికి జన్మించిన పిల్లలు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈ నలుగురు యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ముగ్గురు ఐఏఎస్‌కు ఎంపిక కాగా, ఒకరు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఈ కుటుంబం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌లో ఉంది. వారి తండ్రి అనిల్ ప్రకాష్ మిశ్రా. గ్రామీణ బ్యాంకులో మేనేజరు. ఈయన ఒక గ్రామీణ బ్యాంకు మేనేజరు అయినప్పటికీ తన పిల్లల చదువు విషయంలో ఏనాడూ రాజీపడలేదు. 
 
వారికి మంచి ఉన్నత విద్యను అందించేదుకు నిరంతరం కృషి చేశారు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని, ఆయనతో పాటు తమ కలలను సాకారం చేసుకునేలా కష్టపడి చదవారు. ఫలితంగా ఈయన మొదటి కుమారుడు యోగేష్ మిశ్రా ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన ఈయన గత 2013లో యూపీఎస్సీ పరీక్ష రాసి తన తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 
 
రెండో కుమార్తె క్షమా మిస్రా. మొదటి మూడు ప్రయత్నాలు విఫమైనప్పటికీ నాలుగోసారి మాత్రం విజయం సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. మూడో కుమార్తె మాధురి మిశ్రా. పీజీ పట్టభద్రురాలైన ఈమె 2014లో జరిగిన యూపీఎస్సీ పరీక్షరాసి విజయం సాధిచి జార్ఖండ్ విభాగంలో ఐఏఎస్‌గా పని చేస్తున్నారు. 
 
నాలుగో కుమారుడు లోకేష్ మిశ్రా ప్రస్తుతం బీహార్ ఐఏఎస్ క్యాడెర్ అధికారిగా పని చేస్తున్నారు. ఈయన 2015లో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధిచారు. జాతీయ స్థాయిలో 44వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.