1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (13:17 IST)

సీఎం కొడుకు సీఎం.. జగన్ ఖాతాలో కొత్త రికార్డులు.. అవేంటంటే?

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో సీఎం పదవిని చేపట్టిన తండ్రి కొడుకు సీఎం కాలేదు. ఆ రికార్డును జగన్ తన ఖాతాలో వేసుకున్నారు. 
 

నవ్యాంధ్రప్రదేశ్‌కు జగన్ రెండో సీఎంగా ఈ నెల 30వ తేదీన విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అతి చిన్న వయస్సులో సీఎం కానున్న మూడో వ్యక్తిగా జగన్ చరిత్ర సృష్టించారు. అలాగే సీఎం కొడుకు సీఎం అయిన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.
 
ఇకపోతే.. జగన్మోహన్ రెడ్డికి 46 సంవత్సరాల ఆరు నెలలు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో దామోదరం సంజీవయ్య అత్యంత పిన్న వయస్కులు. ఆయన 38 సంవత్సరాల 11 నెలల వయసులో సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఆయన తర్వాత 45ఏళ్ల 5నెలల అతి తక్కువ వయసులో ముఖ్యమంత్రైన వారి జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. తాజాగా మూడో స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు.