శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (14:37 IST)

జేపీతో చేతులు కలిపిన జేడీ... లోక్‌సత్తా పార్టీ అధినేతగా లక్ష్మీనారాయణ?

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. ఆయన సోమవారం లోక్‌సత్తా పార్టీ సభ్యత్వం స్వీకరించారు. నిజానికి నవంబరు 26వ తేదీన కొత్త పార్టీని స్థాపించి, జెండాతో పాటు పార్టీ అజెండాను ప్రటిస్తానని లక్ష్మీనారాయణ ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రతి ఒక్కరూ ఆయన పెట్టబోయే పార్టీ పేరు ఏమై ఉంటుందోనన్న చర్చసాగింది. అయితే, జేడీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లోక్‌సత్తా సభ్యత్వం స్వీకరించారు. 
 
కాగా, క్విట్ కరప్షన్ మూవ్‌మెంట్‌లో భాగంగా, 69వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.
 
ఈసందర్భంగా జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ, రాజకీయ ప్రయాణం మొదలుపెట్టబోతున్న జేడీ లక్ష్మినారాయణను.. లోక్‌సత్తా పార్టీలోకి సాహదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. లోక్‌సత్తా పార్టీని ఒక అడుగు ముందుకేసి జేడీ లక్ష్మీనారాయణ నడిపితే చాలా సంతోషిస్తానని చెప్పారు. ఓర్పుతో, నేర్పుతో, కొత్త రాజకీయాలతో ముందుకెళ్లాల్సి ఉందని పిలుపునిచ్చారు.