శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (10:00 IST)

వ్యాపారవేత్తను బెదిరించి పెళ్లాడిన బిగ్ బాస్ నటి? ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఫినాయిల్ తాగేసింది...

కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి చైత్ర కొట్టూరు గురువారం తన నివాసంలో ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని తెలుస్తోంది. చైత్రకు మాండ్యాకు చెందిన వ్యాపారవేత్త నాగార్జునను కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
 
ఐతే ఆ యువ వ్యాపారవేత్త కుటుంబం వారి సంబంధాలను అంగీకరించడానికి నిరాకరించడంతో నటి చైత్రను ఇంటికి రానివ్వలేదు. మార్చి 28న, చైత్ర ఒక ఆలయంలో నాగార్జునను వివాహం చేసుకున్న ఫోటో వైరల్ అయ్యింది. కాగా ఆమె గత కొన్ని సంవత్సరాలుగా నాగార్జునతో సంబంధంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 
 ఆమె తన కుటుంబ సభ్యుల సమక్షంలో బైతారాయణపుర గణపతి ఆలయంలో జరిగిన ఒక సాధారణ కార్యక్రమంలో నాగార్జునను పెళ్లాడింది. అయితే, వరుడి కుటుంబాన్ని బెదిరించి నాగార్జునను బలవంతంగా వివాహం చేసుకుందని ఆరోపణలున్నాయి. ఆమె ఆత్మహత్య యత్నం చేయడంతో విషయం కాస్తా కోలార్ లోని పోలీస్ స్టేషనుకి చేరుకుంది. వారి స్టేట్మెంట్ల కోసం మేము రెండు కుటుంబాలను స్టేషనుకి పిలిచామని పోలీసులు తెలిపారు.
 
వివాహం జరిగిన తర్వాత నాగార్జున ఆమెను తీసుకుని అతడి ఇంటికి వెళ్ళినప్పుడు, ఆమెను లోపలికి అనుమతించలేదని, ఈ జంటను ఇంట్లోకి ప్రవేశించవద్దని కోరారనీ, తమకు ఇష్టం లేని పెళ్లి చెల్లదని వారు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.