మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (11:32 IST)

కర్ణాటకలో కోడికూర గొడవ.. కొడుకును కర్రతో కొట్టి చంపేసిన తండ్రి

కోడికూర గొడవ కర్ణాటకలో హత్యకు దారితీసింది. కొడుకు ఇంటికి వచ్చేలోపు కోడికూరను తండ్రి తినేశాడు. తనకు కూర ఎందుకు మిగల్చలేదంటూ తండ్రితో కొడుకు వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా క్షణికావేశంలో కొడుకును కర్రతో తండ్రి కొట్టి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. షీనా అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి సూలీయా తాలూకా గుత్తిగర్ గ్రామంలో నివసిస్తున్నాడు. మంగళవారం ఇంట్లో వండిన కోడి కూర మొత్తాన్ని షీనా తినేశాడు. ఆ తరువాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్‌కు విషయం తెలిసి తండ్రితో గొడవపడ్డాడు. 
 
ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా శివరామన్‌ను కర్రతో కొట్టి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.