గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఆగస్టు 2018 (16:38 IST)

యువతి సాయం వెనుక గొప్ప త్యాగం.. చేపలు అమ్మగా వచ్చిన డబ్బును కేరళ వరద బాధితులకు...

ఓ యువతి తన చదువు కోసం చేపలు అమ్ముకుని పైసా పైసా కూడబెట్టుకుంది. కానీ, కేరళ వరదబాధిత కష్టాలు ఆమెను కలిసివేశాయి. దీంతో తాను దాచిపెట్టుకున్న సొమ్మును కేరళ వరద బాధితులకు ఉపయోగపడేలా ముఖ్యమంత్రి సహాయ నిధికి

ఓ యువతి తన చదువు కోసం చేపలు అమ్ముకుని పైసా పైసా కూడబెట్టుకుంది. కానీ, కేరళ వరదబాధిత కష్టాలు ఆమెను కలిసివేశాయి. దీంతో తాను దాచిపెట్టుకున్న సొమ్మును కేరళ వరద బాధితులకు ఉపయోగపడేలా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. ఇపుడు ఆ యువతి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
కేరళకు చెందిన ఈ యువతి పేరు హనన్, వయస్సు 21. సామాన్య కుటుంబం. తల్లి ఉన్నా తండ్రి లేడు. చదువుకోవాలనే లక్ష్యంతో చేపలు అమ్మేది. కొందరు ఆకతాయిలు మాత్రం గుర్తింపు కోసమే ఇలా చేస్తుందంటూ ఆటపట్టించారు. కానీ, ఆ యువతి మాత్రం తన ధ్యాసను వీడలేదు. మరికొందరైతే హనన్ సమస్యను గుర్తించి ఆమెకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ యువతి చేపలు అమ్మే సమయంలో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
దీంతో ఆ యువతి ఫోటోలు వైరల్ అయ్యాయి. పైగా, ఆమెకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. పలువురు మాలీవుడ్ నటులు కూడా స్పందించి సినిమా అవకాశాలను ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలాగే, హనన్ విద్యభ్యాసానికి ఆర్థికసాయం చేశారు. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదలు హనన్‌ను కదిలించాయి. తాను కష్టపడి సంపాదించిన మొత్తం డబ్బును కేరళ బాధితుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించి మరోసారి వార్తల్లో ఎక్కింది. మొత్తం 1.50 లక్షలను ఇచ్చి పెద్ద మనసు చాటుకుంది. పైగా, ఆ యువతి సాయం వెనుక గొప్ప త్యాగం ఉంది.